సమైక్యత కోసం ఫెడరలిజం

  దేశ సమైక్యతకు ఫెడరలిజం ఎంతో అవసరం. కానీ రోజు రోజుకు ఫెడరలిజం ఉనికిని కోల్పోవడం విచారకరం. ఆయా రాష్ట్రాల, ప్రాంతాల అధికారాలు, హక్కులు, స్వయం నిర్ణాయక శక్తి కలిగి ఉంటూ కేంద్రం కొనసాగినప్పుడే దేశ సమైక్యత స్థిరంగా కొనసాగుతుంది. ఇందుకు భిన్నంగా కేంద్రం అన్ని అధికారాలను కేంద్రీకృతం చేసుకుంటున్నది. ఒక ప్రాంతం, భాష, ఒక జాతి, ఆయా సామాజిక వర్గాలు, కులాలు తమంతట తాము కలిసి జీవించడంలోనే సౌకర్యం, ప్రయోజనం ఉందని స్వచ్ఛందంగా భావిస్తే ఆ […] The post సమైక్యత కోసం ఫెడరలిజం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశ సమైక్యతకు ఫెడరలిజం ఎంతో అవసరం. కానీ రోజు రోజుకు ఫెడరలిజం ఉనికిని కోల్పోవడం విచారకరం. ఆయా రాష్ట్రాల, ప్రాంతాల అధికారాలు, హక్కులు, స్వయం నిర్ణాయక శక్తి కలిగి ఉంటూ కేంద్రం కొనసాగినప్పుడే దేశ సమైక్యత స్థిరంగా కొనసాగుతుంది. ఇందుకు భిన్నంగా కేంద్రం అన్ని అధికారాలను కేంద్రీకృతం చేసుకుంటున్నది. ఒక ప్రాంతం, భాష, ఒక జాతి, ఆయా సామాజిక వర్గాలు, కులాలు తమంతట తాము కలిసి జీవించడంలోనే సౌకర్యం, ప్రయోజనం ఉందని స్వచ్ఛందంగా భావిస్తే ఆ జీవన విధానం, ఆ పరిపాలనా వ్యవస్థ, ఆ సంస్కృతి, ఆ రాజకీయ వ్యవస్థ, ఆ న్యాయ వ్యవస్థ, ఫెడరలిజం విధానం. ఫెడరలిజం వ్యవస్థ అవుతుంది. కుటుంబాన్ని ఒక ఉదాహరణగా తీసకుంటే వ్యక్తి కుటుంబాలుగా విడిపోవడం కన్నా, ఉమ్మడి కుటుంబాలుగా కలిసి ఉంటేనే ఎంతో మంచిది. ప్రయోజనం అదే గొప్ప సంస్కృతి, జీవన విదానం అని భావించడం జరిగితే అలా జీవించే వారిని ఫెడరలిస్టు కుటుంబం అనవచ్చు.

ఫెడరలిజం జాతీయ స్థాయిలో, దేశం స్థాయిలో అనుసరించడానికి, ఆచరించడానికి, వ్యాప్తి చేయడానికి భారత రాజ్యాంగంలో కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. యూనిటరీ రాజ్యాంగంగా ఉన్నప్పటికీ, ఫెడరల్ స్వభావ రాజ్యాంగ అంశాలు కూడా భారత రాజ్యాంగంలో గమనించవచ్చు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సంబంధాలు, రాష్ట్రాల ఏర్పాటు, పునర్విభజన, రాష్ట్రాల అధికారాలు, వాటికి కేటాయించిన రంగాలు, వారి రాజకీయ అధికార పరిధి మొదలైనవాటిల్లో భారత రాజ్యాంగంలో ఫెడరలిజం ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది. కొన్ని అంశాలు కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో చేర్చబడ్డాయి. కొన్ని రాష్ట్రాలు, కేంద్రం చేసిన శాసనాలను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి న్యాయ సమీక్షనుండి మినహాయించడంలో ఫెడరలిజం స్వభావం గమనించవచ్చు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చిన 287 చట్టాలను గమనిస్తే, ఈ విషయం తెలుస్తుంది.

కొందరు మతం ఒకటి కనుక, మరికొందరు భాష ఒకటి కనుక, ఇంకొందరు పక్కపక్క ప్రాంతాలు కనుక, సంస్కృతి ఒకటి కనుక సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, పరిపాలనపరంగా ఒక దేశంగా కలిసి ఉండాలి, ఉండవచ్చు. ఉండవలసిందే. అనుకోవడం సమైఖ్యత రూపంలో సాగే, కొన్ని వర్గాల, జాతుల, కులాల, ప్రాంతాల ఆధిపత్యం, స్వప్రయోజనాలు అవుతాయి. ఇది ఫెడరలిజం కాదు. భిన్నత్వంలో ఏకత్వం. ఏకత్వంలో భిన్నత్వం పేరిట వీరు ఫెడరలిజంగా భ్రమింపజేసి కేంద్రీకృత సెంట్రలిజాన్ని ఆచరిస్తారు. ఇది ఫెడరలిజం కాదు. సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, ప్రాంత, భాష, దేశ వివక్షతలకు, అసమానతలకు, ఆధిపత్యాలకు, అణచివేతలకు వ్యతిరేకంగా వాటిని తొలగించుకొని అన్నిరంగాల్లో సమానత్వాన్ని, స్వేచ్ఛను, సౌభ్రాతృత్వాన్ని, సమాన అవకాశాలు అందుకొనే ప్రత్యేక ఏర్పాట్లను కలిగి ఉండే జీవన విధానం, సంస్కృతి, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిపాలనా వ్యవస్థ మాత్రమే నిజమైన ఫెడరలిజం వ్యవస్థ.

వీటిని అడ్డగించే ఏదైనా అది మనిషిని, ప్రాంతాన్ని, జాతిని, జెండర్‌ను, దేశాన్ని, తెగలను, వారి అభివృద్ధిని, స్వేచ్ఛను, సాధికారికతను కుదించేవి, అణచివేసేవి అవుతాయి. వీటిని అలాంటివాటిని అంతర్గత వలసలు, అంతర్గత ఆధిపత్యం, అంతర్గత అణచివేత, గృహహింస, ప్రాంతీయ హింసవలె, జాతుల హింస. భాషల హింస. ఆయా కులాల అణచివేత అని చెప్పవచ్చు.
భారత రాజ్యాంగం 356 ఆర్టికల్ ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసి గవర్నర్ పరిపాలన, రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టడం ఫెడరలిజానికి భిన్నంగా కేంద్రీకృత కేంద్ర అధికారానికి సంబంధించినది. గవర్నర్ వ్యవస్థ కూడా ఫెడరలిజానికి భిన్నమైనది అని కొందరు భావిస్తుంటారు. సాధారణ పరిస్థితులలో గవర్నర్ వ్యవస్థ కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అనుసంధానం కలిగించే, గవర్నర్ సంక్షిప్త సందర్భంలో, వైవిధ్యాల క్రమంలో సమీక్షించి వివేచనతో ప్రవర్తించే అవకాశం ఉండడం ఎంతో కొంత అవసరమే. కేంద్రం చేసిన బిల్లులను, తీర్మానాలను రాష్ట్రపతి వెనక్కి పంపించినట్టు గవర్నర్ చర్యలను భావించవచ్చు.

ఆయా రాష్ట్రాల అధికారులు, ఉద్యోగుల నియామకాలు కూడా ఐఏఎస్, బ్యాంకు రిక్రూట్‌మెంట్, రైల్వే రిక్రూట్‌మెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టు నియామకాలు, టెలిఫోన్, రేడియో, టీవీ, దూరదర్శన్, విద్యుత్, వైద్యమండలి, అనేక రకాల కాలేజీలకు అనుమతులు ఇవ్వడం కేంద్రం తన పరిధిలోకి కుదించుకుంది. చివరకు ఆయా రాష్ట్రాల, ప్రాంతాల ద్వారా జనాభా లెక్కల సేకరణ కూడా ఆయా రాష్ట్రాలకు లేకుండా చేసి కేంద్రం తన పరిధిలోకి కుదించుకుంది. ఇలా రోజు ఒకటి చొప్పున కేంద్రం తన పరిధిలోకి తెచ్చుకుంటున్నది. జల వివాదాల్లో కూడా ఇదే జరుగుతున్నది. అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చేయడానికి భారత రాజ్యాంగంలో రాజకీయ ప్రజాస్వామ్యానికి గల మౌలిక అంశాలను అన్ని రంగాల్లోకి విస్తరింపజేయడం ద్వారా ఫెడరలిజాన్ని, ఆచరణలోకి తెచ్చుకోవాల్సి ఉంది. దేశంలోని 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా, ఒక దేశంగా భావించి పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందని, 700 జిల్లాలను, 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా పరిగణించడం అవసరం.

ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుండి ప్రజాప్రతినిధులు రాజాకీయాల్లో ఎంపికై దేశ శాసన నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో మూడు ముఖ్య అంగాలు. ఒకటి చట్టసభలు, రెండు పరిపాలనా వ్యవస్థ, మూడు న్యాయ వ్యవస్థ. చట్టసభల్లో ప్రాదేశిక నియోజకవర్గాలవారీగా ప్రజాప్రతినిధులు ఎంపిక జరుగుతున్నది. అదేవిధంగా ఐఏఎస్, ఐపిఎస్, బ్యాంకు రిక్రూట్‌మెంట్, రైల్వే రిక్రూట్‌మెంట్, టెలిఫోన్ రిక్రూట్‌మెంట్, కేంద్ర గ్రూప్ 1 అధికారులు మొదలైన అన్ని ఉద్యోగాల్లో ప్రాదేశిక నియోజకవర్గాలవారీగా, సామాజిక వర్గాల రిజర్వేషన్ల వారీగా ఎంపిక చేసినప్పుడే సమానంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి, భాగస్వామ్యం జరుగుతుంది. అలాగే న్యాయ వ్యవస్థలో, సైనిక వ్యవస్థలో, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో కూడా ప్రాదేశిక నియోజకవర్గాలవారీగా నియామకాలు, అభివృద్ధి జరగడం అవసరం.

అది నిజమైన ప్రజాస్వామ్యం. ఫెడరలిజం. అందువల్ల ప్రజాస్వామ్యం ప్రస్తుతం మూడిం ట ఒక వంతు మాత్రమే కొనసాగుతున్నది. మూడింట రెండు వంతులు అంతర్గత వసాధిపత్యం, అభివృద్ధి చెందిన ప్రాంతాల, కులాల, రాష్ట్రాల, జాతుల, భాషల, నగరాల, పట్టణాల ఆధిపత్యం విస్తరిస్తూ వస్తున్నది. నియోజక వర్గాలవారీగా అన్ని రంగాల్లో నియామకాలు చేసినప్పుడే అందరూ సమానంగా అభివృద్ధి చెందుతారు.

దీనికి అనువుగా ఆయా రాష్ట్రాలు కేంద్రం నుండి ఫెడరల్ విధానంలో అధికారాలు కోరుకుంటున్నాయి. రాష్ట్రాలు కోరుకునే ఫెడరలిజం, అధికారాలు ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల ప్రకారం అభివృద్ధికి బాట వేస్తాయనేది ఏమీ లేదు. ఆయా రాష్ట్రాల ఎంత ఫెడరలిజం కోరినా, రాష్ట్రంలోనే అంతర్గత వలసాధిపత్యం కొనసాగడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఉమ్మడి బిహార్‌లో, ఉమ్మడి ఉత్తరప్రదేశ్‌లో, ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాము. అలా 14 రాష్ట్రాలు 29 రాష్ట్రాలుగా ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా 1520 ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అందువల్ల ఫెడరలిజం అనే భావన రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అధికారాలకు పరిమితం చేయకుండా నియోజకవర్గాలవారీగా, జిల్లాల వారీగా, ఫెడరలిజం ఆచరణలోకి వచ్చేవిధంగా ఆలోచించడం అవసరం.

Federalism for integration

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సమైక్యత కోసం ఫెడరలిజం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.