కేంద్రంలో కూటమి రావాలి: కెసిఆర్

  వరంగల్: ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలు పూర్తి కావొస్తున్నాయని, కాళేశ్వరం వద్ద బటన్ ఆన్ చేస్తే ఆరు నెలలు కాలువల్లో నీళ్లు ఉంటాయని సిఎం కెసిఆర్ తెలిపారు. జయశంకర్ సార్ విగ్రహానికి కెసిఆర్ నివాళులర్పించారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడారు. వరంగల్ చాలా చైతన్యవంతమైన జిల్లా అని, తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది వరంగల్ జిల్లా అని కొనియాడారు. ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నట్టే గెలుపులో వరంగల్ అగ్రభాగాన ఉండాలని […]

 

వరంగల్: ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలు పూర్తి కావొస్తున్నాయని, కాళేశ్వరం వద్ద బటన్ ఆన్ చేస్తే ఆరు నెలలు కాలువల్లో నీళ్లు ఉంటాయని సిఎం కెసిఆర్ తెలిపారు. జయశంకర్ సార్ విగ్రహానికి కెసిఆర్ నివాళులర్పించారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడారు. వరంగల్ చాలా చైతన్యవంతమైన జిల్లా అని, తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది వరంగల్ జిల్లా అని కొనియాడారు. ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నట్టే గెలుపులో వరంగల్ అగ్రభాగాన ఉండాలని పిలుపునిచ్చారు.

విద్యుత్ తలసరి ఆదాయంలో వరంగల్ జిల్లా ప్రధమ స్థానంలో ఉందన్నారు. అనేక కార్యక్రమంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా ఉందని పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో 70 వేల టిఎంసిల నీళ్లు ఉన్నాకూడా… దేశం చీకట్లో ఉండటానికి కారణం బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలేనని కెసిఆర్ మండిపడ్డారు. వచ్చె నెల నుంచి పెన్షన్లు రెట్టింపు చేస్తామని కెసిఆర్ వెల్లడించారు. ఇకపై కాకతీయ కాలువలో నీళ్లు ఉండవని ప్రసక్తే ఉండదన్నారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్, బిజెపిలేనని ఇప్పుడేమో నోరు పారేసుకుంటు ఒకరి ఒకరు నిందలు వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిజెపిలు లేని కూటమి కేంద్రంలో రావాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తే గెలివాల్సింది పార్టీలు కాదని… ప్రజల అభిమతం గెలువాలన్నారు. ఢిల్లీ మనని సాదడం లేదని… ఢిల్లీనే మనం పోషిస్తున్నామని కెసిఆర్ చెప్పారు. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలంటే ప్రాంతీయ పార్టీల పెత్తనం ఢిల్లీలో ఉండాలన్నారు. పసునూరి దయాకర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 

 

Federal Front Rule in Central Government: KCR

Related Stories: