అంగరంగ వైభవంగా ఫాతిమామాత ఉత్సవాలు

భారీగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసిన బిషప్‌లు రథంపై ఫాతిమామాత ప్రతిమతో ఊరేగింపు మన తెలంగాణ/కాజీపేట: ఫాతిమానగర్‌లోని కెథిడ్రల్ చర్చిలో ఫాతిమామాత ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కాజీపేట పట్టణంలోని ఫాతిమానగర్‌లో జరగుతున్న ఫాతిమా మాత తిర్నాళ్లు సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై కథోలిక మేత్రాసనం పీఠాదిపతి బిషప్ ఉడుమల బాల దివ్వబలి పూజ సమర్పించి ఉత్సావాలను ప్రారంభించారు. అనంతరం క్రిస్మతైలం పరిశుద్ద పూజను ప్రభువుకు అంకితమిచ్చినట్లు క్రైస్తవ భక్తుల జయజయ ధ్వానాల మద్య […]

భారీగా తరలివచ్చిన భక్తులు
ప్రత్యేక ప్రార్థనలు చేసిన బిషప్‌లు
రథంపై ఫాతిమామాత ప్రతిమతో ఊరేగింపు

మన తెలంగాణ/కాజీపేట: ఫాతిమానగర్‌లోని కెథిడ్రల్ చర్చిలో ఫాతిమామాత ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కాజీపేట పట్టణంలోని ఫాతిమానగర్‌లో జరగుతున్న ఫాతిమా మాత తిర్నాళ్లు సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై కథోలిక మేత్రాసనం పీఠాదిపతి బిషప్ ఉడుమల బాల దివ్వబలి పూజ సమర్పించి ఉత్సావాలను ప్రారంభించారు. అనంతరం క్రిస్మతైలం పరిశుద్ద పూజను ప్రభువుకు అంకితమిచ్చినట్లు క్రైస్తవ భక్తుల జయజయ ధ్వానాల మద్య ఆయన ప్రకటించారు. ఈసందర్భంగా భక్తులనుద్ధేశించి మాట్లాడుతూ దైవాంశ సంభూతుడైన ఏసుక్రీస్తు ను ఫాతిమామాత బాహ్య ప్రపంచానికి తీసుకొచ్చి పునితురాలైందన్నారు. శాంతియుత జీవనం కోసం ప్రతి ఒక్కరను క్రీస్తు మార్గాన్ని అనుసరించాలని కోరారు. ఫాతిమా కెథిడ్రల్ విచారణ కమిటి అధ్యక్షుడు డిఎల్ రెడ్డి, కార్యదర్శి ఆర్.రాజమోహన్‌రావు, టి.మరి రెడ్డి, కె.కిరణ్ లు బిషప్ పౌల్ మైపన్‌ను పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఘనంగా ఫాతిమామాత ఊరేగింపు…

ఉత్సవాలను పురస్కరింప్చకుని ఏర్పాటు చేసిన ఫాతిమా మాత జూబ్లి రథానికి వరంగల్ మేత్రాసన పీఠాధిపతి బిషప్ బాల సాయంత్రం ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.లోకమాత చల్లని దీవేనలతో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని అకాంఞన్తూ ఊరేగింపు ప్రారంభించారు.కాగా మత గురువులు,మత కన్నలు భక్తులు ఆరాధన కీర్తనలతో ఫాతిమామాతను పూరవీధుల్లో ఊరేగించి కెథిడ్రల్ చర్చిలోకి తీసుకెళ్లారు.

మొక్కులు చెల్లించుకున్న భక్తులు …

కెథిడ్రల్ చర్చి ఆవరణలో కొలువుదీరిన ఫాతిమామమాత గుహా ఎదుట వేలాది మంది భక్తులు కొవ్వొత్తులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి తలనీలాలు సమర్పించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఫాతిమామమాతను దర్శించుకున్నారు.  ఈకార్యక్రమంలో ఫాదర్ సింగారెడ్డి బాలశౌరి,ఫాదర్ కె.విజయ్ కుమార్,ఫాదర్ గాలి రాయప్ప,ఫాదర్ వై.కిరణ్,ఫాదర్,ఫాదర్ గంగారపు సురేష్,పొలిమెర సురేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

 

Fathima Matha Celebrations in Warangal Urban

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: