కుమారుడిని చంపిన తండ్రి…

  షాద్‌నగర్: భూమిని విక్రయించవద్దని చెప్పిన పాపానికి తండ్రి చేతిలో తనయుడు హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ తాలూకా కేశంపేట మండలంలోని తూర్పుగడ్డతండాలో శనివారం కలకలం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం.. తూర్పుగడ్డతండాకు చెందిన రాములునాయక్ భూమిని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో చర్చించగా రాములు కొడుకు ఆంజనేయులు(24) భూమిని విక్రయించవద్దని తండ్రికి అడ్డు పడ్డాడని, దీంతో ఎలాగైనా భూమిని అమ్మాలని నిర్ణయించుకున్న రాములు ఆం జనేయులు అడ్డువస్తున్నాడని గ్రహించి అతను […] The post కుమారుడిని చంపిన తండ్రి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

షాద్‌నగర్: భూమిని విక్రయించవద్దని చెప్పిన పాపానికి తండ్రి చేతిలో తనయుడు హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ తాలూకా కేశంపేట మండలంలోని తూర్పుగడ్డతండాలో శనివారం కలకలం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం.. తూర్పుగడ్డతండాకు చెందిన రాములునాయక్ భూమిని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో చర్చించగా రాములు కొడుకు ఆంజనేయులు(24) భూమిని విక్రయించవద్దని తండ్రికి అడ్డు పడ్డాడని, దీంతో ఎలాగైనా భూమిని అమ్మాలని నిర్ణయించుకున్న రాములు ఆం జనేయులు అడ్డువస్తున్నాడని గ్రహించి అతను నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో తలపై మోదాడని, ఈ ప్రమాదంలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు.

Father who killed the Son

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కుమారుడిని చంపిన తండ్రి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.