కాళ్లు, చేతులు కట్టేసి…కూతురిపై తండ్రి అత్యాచారం

Rapes

 

రాజస్థాన్‌లో వెలుగు చూసిన మరో ఘోరం

జైపూర్: పెద్ద పెద్ద గొలుసులతో చేతులు, కాళ్లు కట్టేసి కన్నతండ్రే 17 ఏళ్ల కూతురిపై ఇంట్లోనే అత్యాచారం చేసినట్టు తెలిసిందని రాజస్థాన్ పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని జలోర్‌లో జరిగిన ఈ ఘోరంలో జరిగింది. పోలీసులకు చేసిన ఫిర్యాదులో తండ్రే నిందితుడని ఆమె తెలిపింది. తండ్రి మరో మహిళతో ఉండడం తను చూసిన తర్వాత అతను పెద్ద గొలుసులతో తన కాళ్లు చేతులు కట్టేసి అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది. ఆ అమ్మాయి ఎలాగోలాగ ఇంట్లోంచి తప్పించుకుని పోయిన తర్వాత మేనమామ ఆమె తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనను కట్టేసి తండ్రి గత కొన్ని రోజులుగా అత్యాచారం చేశాడని ఆమె చెప్పింది. ఆమె తల్లి గృహహింసకు తట్టుకోలేక ఏడేళ్ల కిందటే భర్తను వదిలేసి వెళ్లి, మరో పెళ్లి చేసుకుందని మేనమామ చెప్పారు. అయితే కూతురు మాత్రం తండ్రితోనే ఉంటోంది. శుక్రవారంనాడు ఆ అమ్మాయి ఎలాగో ఇంట్లోంచి తప్పించుకుని, కాళ్లకు గొలుసులతోనే మేనమామ పొలం వద్దకు వచ్చింది. ఆ తర్వాత మేనమామ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తుకోసం ఎస్‌సి/ఎస్‌టి సెల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు ఇచ్చామని, ఆ అమ్మాయిని వైద్య పరీక్షకు పంపుతామని సీనియర్ పోలీస్ అధికారి గిరిధర్ సింగ్ తెలిపారు.

Father Rapes his 17-year-old Daughter at home

The post కాళ్లు, చేతులు కట్టేసి… కూతురిపై తండ్రి అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.