గణాంకశాస్త్ర పితామహుడు పిసి మహలనోబిస్…

  జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌లాల్ కరీంనగర్ : భారత గణాంక శాస్త్ర పితామహుడు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ అని గణాంక శాస్త్రంలో వీరు అందించిన సేవలు మరువలేనివని జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయంలో పి.సి. మహలనోబిస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 13వ జాతీయ గణాంక దినోత్సవం కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధి సాధించాలంటే పకడ్భందీ […] The post గణాంకశాస్త్ర పితామహుడు పిసి మహలనోబిస్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌లాల్

కరీంనగర్ : భారత గణాంక శాస్త్ర పితామహుడు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ అని గణాంక శాస్త్రంలో వీరు అందించిన సేవలు మరువలేనివని జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయంలో పి.సి. మహలనోబిస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 13వ జాతీయ గణాంక దినోత్సవం కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధి సాధించాలంటే పకడ్భందీ ప్రణాళికలు అవసరమని అన్నారు.

పి.సి. మహలనోబిస్ మంచి ప్రణాళిక రూపకర్త అని, భారతదేశంలో మొదటి ప్లానింగ్ కమిషన్ లో సభ్యుడని అన్నారు. రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త పి.సి. మహలనోబిస్ అని అ న్నారు. ఎంతో ముందు చూపుతో లక్షాలను నిర్ధేశించుకొని, పంచవర్ష ప్రణాళికలను రూపొందించిన మహనీయుడు పి.సి.మహలనోబిస్ అన్నారు. కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించిన మహా వ్యక్తి అని అన్నారు. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ స్థాపనకు కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. ప్రపంచంలో ప్రఖ్యాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణాంక శాస్త్రవేత్తగా పని చేశారని ఆయన తెలిపారు.

గణాంక శాస్త్రంలో పి.సి. మహలనోబిస్ అందించిన సేవలను గుర్తించి, భారత ప్రభుత్వం 1968వ సంవత్సరంలో భారతదేశ రెండవ అత్యున్నత పౌ ర పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ అవార్డును ప్రధానం చేసిందని అన్నారు. పి.సి. మహలనోబి స్ జన్మదినం పురస్కరించుకొని గత 12 సంవత్సరాలుగా ఒక గణాంక అంశమును నేపథ్యంగా తీసుకొని, ప్రతి సంవత్సరం జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ 13వ గణాంక దినోత్సవాన్ని ‘సుస్థిర అభివృద్ధి ల క్షాలు’ అనే అంశాన్ని తీసుకొని జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.

దేశం అభివృద్ధి సాధించాలంటే పకడ్భందీ ప్రణాళికలు, గణాంకాలు ముఖ్యమని అన్నా రు. మన దేశం ఎంత అభివృద్ధి సాధించింది అని తెలుసుకోవడానికి, గణాంకాల సేకరణపై ఆ ధారపడి ఉంటుందని అన్నారు. పి.సి.మహలనోబిస్ కన్న కళలను నెరవేర్చుటకు అందరూ క లిసి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయం గణాంక అధికారి వి.పూర్ణ చందర్ రావు, పి.బి. శ్రీనివాస్, సత్యం, ఉప గణాంక అధికారి ఎస్. లక్ష్మి, పర్యవేక్షకులు రాందత్తారెడ్డి, కార్యాలయ సిబ్బంది బి.సునంద, కృష్ణమూర్తి, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Father of Statistics PC Mahalanobis

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గణాంకశాస్త్ర పితామహుడు పిసి మహలనోబిస్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: