కూతురి నిర్వాకం.. చావబాదిన తండ్రి..!(వీడియో)

వరంగల్: ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన కూతురిని తండ్రి అందరి ముందు చితకబాదాడు. ఈ సంఘటన ఆదివారం వరంగల్‌లోని ఎస్2 సినిమా థియేటర్ వద్ద చోటుచేసుకుంది. ఇంట్లో స్నేహితురాలిని కలవడానికి వెళ్తున్ననని చెప్పి బయటకు వచ్చిన కూతురు ప్రియుడితో కలిసి సినిమాకు వెళ్లింది. అనుకోకుండా ఆమె తండ్రి కూడా అదే థియేటర్‌కు రావడంతో లవర్స్ అడ్డంగా దొరికిపోయారు. కుమార్తె నిర్వాకం చూసిన తండ్రికి గుండెలు బద్దలైనంత పనైంది. తన పెంపకానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించిన కూతురును అందరి ముందే […]

వరంగల్: ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన కూతురిని తండ్రి అందరి ముందు చితకబాదాడు. ఈ సంఘటన ఆదివారం వరంగల్‌లోని ఎస్2 సినిమా థియేటర్ వద్ద చోటుచేసుకుంది. ఇంట్లో స్నేహితురాలిని కలవడానికి వెళ్తున్ననని చెప్పి బయటకు వచ్చిన కూతురు ప్రియుడితో కలిసి సినిమాకు వెళ్లింది. అనుకోకుండా ఆమె తండ్రి కూడా అదే థియేటర్‌కు రావడంతో లవర్స్ అడ్డంగా దొరికిపోయారు. కుమార్తె నిర్వాకం చూసిన తండ్రికి గుండెలు బద్దలైనంత పనైంది. తన పెంపకానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించిన కూతురును అందరి ముందే తండ్రి చితకబాదాడు. జీవితంలో ఎంతో సాధిస్తావని తాము ఆశపడితే నీవు చేసే పని ఇదా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. దీంతో అక్కడ ఉన్నవారు ఆయన్ను ఆపేందుకు యత్నించారు. ఈ సంఘటనతో థియేటర్ వద్ద కాసేపు గందరగోళం నెలకొంది.

(Courtesy By: hmtv)

Comments

comments