ఘోర రోడ్డు ప్రమాదం: తండ్రి, కొడుకు మృతి

Road-Accidentనల్లగొండ: గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి, కొడుకు మృతిచెందిన విషాద సంఘటన నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి స్టేజ్ దగ్గర గురువారం చోటుచేసుకుంది. టివిఎస్ ఎక్సెల్ వాహనంపై కూతురు ఇంటికి వట్టివర్ధి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను తిప్పర్తి మండలం అంతయ్యగూడెంకు చెందిన సిరిగిరి కొండల్‌రెడ్డి, లింగారెడ్డిగా గుర్తించారు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గురైన లారీ ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం తో మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Father And Son Died in Road Accident At Nalgonda

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఘోర రోడ్డు ప్రమాదం: తండ్రి, కొడుకు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.