ఫసల్ బీమా యోజన పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం: లింగయ్య

ఢిల్లీ: ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని రాజ్యసభ టిఆర్‌ఎస్ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. రాజ్యసభలో జీరో అవర్‌లో ఫసల్ బీమా అంశంపై లింగయ్య ప్రస్తావించారు. ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రైతాంగం చాలా ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం కింద తెలంగాణకు రూ.511 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, కమర్షియల్ పంటల రైతులకు ఈ బీమా ఎంతో ఉపయోగంగా ఉంటుందని, ఫసల్ బీమా యోజన పథకాన్ని మోడీ ప్రభుత్వం ఆటంకాలు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

The post ఫసల్ బీమా యోజన పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం: లింగయ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.