ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా పొలాల పండగ

 Farming festivals Celebrations In Komrambhhem Dist

కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం  పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకున్నారు. ఆసిఫాబాద్‌తో పాటు జైనూర్, లింగాపూర్, కాగజ్‌నగర్, దహెగాం, సిర్పూర్(యు), కెరమెరి, వాంకిడి మండలాల్లో ఊరూరా పొలాల పండుగ ఘనంగా నిర్వహించారు .ఉదయాన్నే ఎడ్లను అలంకరించిన రైతులు గ్రామాల్లో ర్యాలీ తీశారు. అనంతరం ఇంటిల్లిపాది ఎడ్లకు పూజలు చేసి వాటిని ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు.