పాఠశాల కొచ్చిన ఆవులు…

cowsసంబల్: ఆవులు పొలాల్లోకి వచ్చి తమ పంటను నాశనం చేస్తున్నాయని కోపంతో ఊగిపోయిన రైతులు, వాటిని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోకి పంపి బయట నుంచి తాళం వేసిన సంఘటన ఉత్తర్ ప్రధేశ్ లోని సంభల్ జిల్లాలో చోటుచేసుకుంది. తరగతులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా దాదాపు 200 వందలకు పైగా ఆవులు కనిపించడంతో విద్యార్ధులు ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. ఈ విషయంపై పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో నెట్టిన రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

farmers lock 200 cows in uttar pradesh

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాఠశాల కొచ్చిన ఆవులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.