పాడి పశువులపై రైతుల శ్రద్ధ…

 Dairy Cattle

 

పాల డైరీతో లాభాలెన్నో

నవీపేట : మండలంలోని యువత, రైతులు స్వయం ఉపాధి వైపు శ్రద్ధ్ద సారిస్తున్నారు. తనకాళ్లపైన తాను నిలబడడంతో పాటు ఇతరులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో పాలడైరీ, ఇతర పరిశ్రమలవైపు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని మహం తం గ్రామానికి చెందిన బండ్ర రాములు అనే రైతు పాడి గెదేలతో డైరిని స్థాపించి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

వర్షాలు లేకపోవడంతో ఏమి చేయలో తోచని ప రిస్థితుల్లో తనకు గ్రామ పక్కన ఉన్న పొలంవద్ద షేడ్‌ను వేసి 11 గెదేలతో పాలడైరీని నిర్వహించారు. ఇద్దరు పా లేరులకు ఉపాధి కల్పిస్తూ, రోజు ఉదయం 50లీటర్లు, సాయంత్రం 50 లీటర్ల పాలను నిజామాబాద్‌కు తీసుకువెళ్లి డైరీలో పోసివస్తున్నట్లు తెలిపారు. నెలకు అన్ని ఖ ర్చులు, పశువుల దానాకు పోగా 50, 60వేల వరకు డ బ్బులు మిగిలుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పాడి పరిశ్రమ లోన్ సౌకర్యం కల్పిస్తే మరింత మందికి ఉపాధి కల్పించవచ్చని అన్నారు.

డైరీతో నలుగురికి ఉపాధి
పాల డైరీ వల్ల నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్లు, వర్షం లేని కారణంగా తన వ్యవసాయ భూమిలో పశువుల మే తకోసం గడ్డి వేసినట్లు మొత్తం 10లక్షల రూపాయలను ఖర్చు చేసి 11 గెదేలను కొనుగోలు చేసినట్లు ఆయన తె లిపారు. డైరీ ఉదయం, సాయంత్రం పాలను నిజామాబాద్ డైరీకి తానే స్వయాన తీసుకెళ్తున్నట్లు, ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలు ఇపిస్తే మాలాంటి యువత ముందుకు సాగుతుందన్నారు.

Farmers’ attention on Dairy Cattle

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాడి పశువులపై రైతుల శ్రద్ధ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.