వానొచ్చింది.. వాగొచ్చింది…

  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు రంగారెడ్డి  : మండుఎండలతో మడిపోయిన రైతులపై వరుణుడు కరుణిస్తున్నారు. రెండు రోజులుగా రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలల్లోని వివిధ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం నాడు రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల, షాబాద్ మండలాలలతో పాటు నగర శివారులోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. షాబాద్, చెవెళ్ల మండలాల్లో వర్షం కుండపోత మాదిరిగా రావడంతో ఈసి వాగు పొంగి […] The post వానొచ్చింది.. వాగొచ్చింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు

రంగారెడ్డి  : మండుఎండలతో మడిపోయిన రైతులపై వరుణుడు కరుణిస్తున్నారు. రెండు రోజులుగా రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలల్లోని వివిధ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం నాడు రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల, షాబాద్ మండలాలలతో పాటు నగర శివారులోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. షాబాద్, చెవెళ్ల మండలాల్లో వర్షం కుండపోత మాదిరిగా రావడంతో ఈసి వాగు పొంగి ప్రవహించింది.

షాబాద్ మండలంలో నాగర్‌గూడ వద్ద వాగు ఉప్పొంగి హిమాయత్‌సాగర్ వైపు జోరుగా ప్రయాణించింది. గతంలో ఎగువ ప్రాంతంలో వర్షం కురవడంతో వచ్చిన వాగు నీరు హిమాయత్‌సాగర్ వరకు చేరకపోయిన నేడు మాత్రం మొయినాబాద్ మండలం వెంకటాపూర్ మీదుగా సాగర్ వైపు వాగులో నీరు దూసుకుపోయింది. రంగారెడ్డి జిల్లాలో జూన్ సాదారణ వర్షపాతం 72.2 మి.మిలకు గాను 65.5 మి.మి, వికారాబాద్‌లో 82.7 మి.మికి గాను 71.5 మి.మి వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంబించారు.

ప్రభుత్వం రైతు బందు క్రింద ఇప్పటికే పెట్టుబడి సాయం అందచేయడంతో రైతులు వ్యవసాయ పనులలో పూర్తిగా నిమగ్నమయ్యారు. వరుణుడు ప్రతాపంలో నగర శివారులోని పలు ప్రాంతాల్లో నీరు రోడ్లపై జామ్‌కావడంతో యదావిధిగా ట్రాఫీక్ ఇక్కట్లు మాత్రం తప్పలేదు. జిల్లాలోని ఐటి కారిడార్‌తో పాటు ఎల్.బి.నగర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో సైతం వరుణుడి ప్రతాపంకు ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డ జనం మాత్రం భారీ వర్షాలు కురవాలని ప్రార్థ్ధిస్తున్నారు.

Farmers are Happy with the Rains

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వానొచ్చింది.. వాగొచ్చింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.