సకలజీవుల సేవకుడు రైతు

రైతే రారాజు ఇదిగో రుజువు   మనతెలంగాణ/ఝరాసంగం: ఎద్దు ఏడ్చిన ఎవుసం – రైతు ఏడ్చిన రాజ్యం మునుగడ సాధించినట్లు చరిత్రలో లేదని అన్నాడు ఓ మహానుభావుడు, రైతే రారాజు అన్నాడు మరో కవి. ఇది నిజమే అనడానికి అనాది నుండి నేటి వరకు రైతును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆనాదిగా రైతు దుక్కి దున్ని, నారు పోసి, నీరు పెట్టి పంటలు పండించి అందరి ఆకలి తీర్చడమే కాకుండా పశు పక్షాదులకు సైతం సేవ చేస్తున్న […]

రైతే రారాజు ఇదిగో రుజువు

 

మనతెలంగాణ/ఝరాసంగం: ఎద్దు ఏడ్చిన ఎవుసం – రైతు ఏడ్చిన రాజ్యం మునుగడ సాధించినట్లు చరిత్రలో లేదని అన్నాడు ఓ మహానుభావుడు, రైతే రారాజు అన్నాడు మరో కవి. ఇది నిజమే అనడానికి అనాది నుండి నేటి వరకు రైతును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆనాదిగా రైతు దుక్కి దున్ని, నారు పోసి, నీరు పెట్టి పంటలు పండించి అందరి ఆకలి తీర్చడమే కాకుండా పశు పక్షాదులకు సైతం సేవ చేస్తున్న గొప్ప మనుసున్న మహానుభావుడు రైతు. పూర్వం పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రంలోని కర్కనెల్లి ప్రాంతంలో బక్కప్రభు మహారాజు అనే సాధువు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని భక్తులకు ఆద్యాత్మిక ప్రవచనాలు చేయడమే కాకుండా ఆశ్రమానికి ఉన్న సుమారు 60 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ రకరకాల పంటలతో పాటు సాయిజొన్న పంట పండించేవారు. ఒక రోజు ఓ భక్తుడు తన దగ్గరకు వచ్చి అయ్యా జొన్న కంకులను పక్షులు నాశనం చేస్తున్నాయి. నేను కాపలగా ఉంటాను అన్నాడంట.

దీంతో ఆ మహారాజు భక్తునితో ఇలా అంటాడంట. అయ్యా జొన్న కంకులు పక్షులు తింటే తరిగి పోదు. నీవేమి దిగులు పడకు. కాక పోతే నీవు ఒక పని చెయ్యి అన్నాడంట. ఆ దంట్లకు మట్టి గురుగులు కట్టి నీళ్లు పోయి అంటాడంట. అప్పుడు ఆ భక్తుడు మహారాజు చెప్పిన పని చేశాడంట. తీరా పంట నూర్పిడి అయిన తర్వాత అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో పంట పండిందని చరిత్ర. ఈ కథ చదివిండో లేదా రైతు రైతులా ఉండాలే అనుకున్నాడో తెలియదు ఈ రైతు. కాని మహారాజు చేసిన విధంగానే చేశాడు.

మండల పరిధిలోని బర్దీపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ళ మాణప్ప అనే రైతు తనకున్న ఎకరం పొలంలో సాయిజొన్న పంటను వేశాడు. ప్రస్తుతం ఆ పంట కాపిళ్ళ దశలో ఉంది. పక్షుల ఆకలి తీర్చాలని తలంచి ఆ రైతు ప్లాస్టిక్ గ్లాసుల్లో నీరు పోసి పొలం చట్టూతో పాటు చుట్టు పక్కల ఉన్న చెట్లకు త్రాడుతో కట్టాడు. ఇది ఏమని రైతును అడగగా మనమైతే ఏదో ఒక పనిచేసి సంపాదించి పొట్ట నింపుకుంటాం మరి పశుపక్షాదులకు ఎవరు చేస్తారు. అందుకే ఇలా చేశానని పెద్ద మనుసుతో చెప్పాడు ఆ రైతు. ఇది రైతంటే అందుకే భారత మాజీ ప్రధాని మంత్రి లాల్‌బహద్దూర్ శాస్త్రి జై జవాన్-జై కిసాన్ అన్నాడు.ఇది రైతు గొప్పతనం. నేటి సమాజంలో ప్రతి ఒక్కరు ఇలాంటి రైతును చూసి చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Farmer Free Service to Birds In Medak

 

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: