ఎస్‌ఐపై హెచ్‌ఆర్‌సికి రైతు ఫిర్యాదు

  మనతెలంగాణ/హైదరాబాద్ : తనపై అకారణంగా దాడి చేసిన ఎస్‌ఐ శ్రీహరిపై చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు హరీష్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎస్‌ఐ శ్రీహరిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశాడు. బైపాస్‌లో ఆరబెట్టిన మొక్కల వద్ద కాపలాగా ఉన్న తన తండ్రి గండ్ల రాజేందర్‌పై పోలీసులు దాడి చేశారని, స్టేషన్‌కు తీసుకువెళ్లి విచక్షణారహితంగా కొట్టారని హరీష్ ఫిర్యాదు చేశాడు. తన తండ్రి కోసం వెళ్లిన తనను […] The post ఎస్‌ఐపై హెచ్‌ఆర్‌సికి రైతు ఫిర్యాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తనపై అకారణంగా దాడి చేసిన ఎస్‌ఐ శ్రీహరిపై చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు హరీష్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎస్‌ఐ శ్రీహరిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశాడు. బైపాస్‌లో ఆరబెట్టిన మొక్కల వద్ద కాపలాగా ఉన్న తన తండ్రి గండ్ల రాజేందర్‌పై పోలీసులు దాడి చేశారని, స్టేషన్‌కు తీసుకువెళ్లి విచక్షణారహితంగా కొట్టారని హరీష్ ఫిర్యాదు చేశాడు. తన తండ్రి కోసం వెళ్లిన తనను కూడా పోలీసులు కొట్టారని హరీష్ వివరించాడు.

చిక్కడపల్లి ఎఐపై సిపికి ఫిర్యాదు ః
చిక్కడపల్లి ఎస్పైపై ఓ యువకుడు సిపికి ఫిర్యాదు చేశాడు. ఓ కేసు విషయంలో శ్రీధర్ అనే యువకుడి నుంచి రూ.20వేల నగదును సదరు ఎస్‌ఐ కిషోర్ అప్పుగా తీసుకున్నారు. బంగారం తాకట్టు పెట్టి మరీ శ్రీధర్ డబ్బు తీసుకొచ్చి ఎస్‌ఐకి ఇచ్చానని, లాక్‌డౌన్ వేళ ఇబ్బందిగా ఉందని డబ్బులు తిరిగివ్వమని ఎస్‌ఐని శ్రీధర్ కోరాడు. అయితే తాను ఆ డబ్బులు ఇవ్వనంటూ ఎస్‌ఐ కిషోర్ దుర్భాషలాడారని శ్రీధర్ నగర సిపి అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశాడు.

Farmer complaint to HRC against SI

The post ఎస్‌ఐపై హెచ్‌ఆర్‌సికి రైతు ఫిర్యాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: