తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్ టికెట్ల కోసం బారులు

  కోల్‌కతా : భారత గడ్డపై జరిగే తొలి డేనైట్ టెస్టు మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. బెంగాల్ క్రికెట్ సంఘం అధికారులు ఈ మ్యాచ్ కోసం టికెట్ల ధరను భారీగా తగ్గించారు. అభిమానులను ఆకట్టు కోవాలనే ఉద్దేశంతో అందరికి అందబాటులో ఉండే విధంగా టికెట్ల ధరను నిర్ణయించారు. రూ.50, 100, 150 టికెట్ల […] The post తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్ టికెట్ల కోసం బారులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కోల్‌కతా : భారత గడ్డపై జరిగే తొలి డేనైట్ టెస్టు మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. బెంగాల్ క్రికెట్ సంఘం అధికారులు ఈ మ్యాచ్ కోసం టికెట్ల ధరను భారీగా తగ్గించారు. అభిమానులను ఆకట్టు కోవాలనే ఉద్దేశంతో అందరికి అందబాటులో ఉండే విధంగా టికెట్ల ధరను నిర్ణయించారు. రూ.50, 100, 150 టికెట్ల కోసం అభిమానులు టికెట్ కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఇప్పటికే చాలా వరకు టికెట్లు అమ్ముడై పోయాయి. మిగిలిన కొద్ది టికెట్లను సొంతం చేసుకునేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు.

అంతేగాక బంగ్లాదేశ్ నుంచి కూడా చాలా మంది అభిమానులు మ్యాచ్‌ను చూసేందుకు వస్తున్నారు. దీంతో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. నిర్వాహకులు కూడా సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉంచేలా చూస్తున్నారు. ఇప్పటి వరకు భారత గడ్డపై డేనైట్ టెస్టు మ్యాచ్ జరగలేదు. దీంతో తొలిసారి జరుగనున్న మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీని కోసం టికెట్లను తీసుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు.

Fan interest for the Day Night Test match

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్ టికెట్ల కోసం బారులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: