ఉద్యోగం నుంచి తీసేశారని…వ్యక్తి ధర్నా

మన తెలంగాణ/రేగోడ్: అధునిక వ్యవసాయ మార్కెట్ గోదాంలో గత నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్న శివకుమార్  అనే వ్యక్తిని అధికారం అండతో ఓ ప్రజాప్రతినిధి ఉద్యోగం తీసివేయించారు.  ఈ ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని టి.లింగంపల్లి ప్యారారం మధ్యలో అధునిక వ్యవసాయ మార్కెట్ గోదాంలో నాలుగు సంవత్సరాలుగా టి.లింగంపల్లి గ్రామానికి చెందిన శివకుమార్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో మల్లికార్జున్ అనే అధికారి లింగంపల్లి గ్రామానికి చెందిన శివకుమార్‌ను పెట్టుకున్నారు. నెలకు పన్నెండు వేల జీతం ఇస్తున్నారు. […]

మన తెలంగాణ/రేగోడ్: అధునిక వ్యవసాయ మార్కెట్ గోదాంలో గత నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్న శివకుమార్  అనే వ్యక్తిని అధికారం అండతో ఓ ప్రజాప్రతినిధి ఉద్యోగం తీసివేయించారు.  ఈ ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని టి.లింగంపల్లి ప్యారారం మధ్యలో అధునిక వ్యవసాయ మార్కెట్ గోదాంలో నాలుగు సంవత్సరాలుగా టి.లింగంపల్లి గ్రామానికి చెందిన శివకుమార్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో మల్లికార్జున్ అనే అధికారి లింగంపల్లి గ్రామానికి చెందిన శివకుమార్‌ను పెట్టుకున్నారు. నెలకు పన్నెండు వేల జీతం ఇస్తున్నారు. ఆ తర్వాత దేవేందర్‌సింగ్ అనే అధికారి గత మూడు నెలల క్రితం ఇక్కడికి వచ్చారు.

దేవేందర్‌సింగ్ వచ్చినప్పటి నుంచి శివకుమార్‌కు ఎనిమిది వేల జీతం ఇవ్వడమే కాకుండా ఉపాధి నుంచి తొలగించారు. దీంతో ఉపాధి కోల్పోయిన శివకుమార్ భార్య, ఇద్దరు కూతుళ్లతో మంగళవారం ఆధునిక వ్యసాయ మార్కెట్ గోదాం వ్దద దర్నా చేపట్టారు. శివకుమార్ విలేకర్లతో మాట్లాడుతూ… మా గ్రామ సర్పంచ్ భర్త రేగోడ్ మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు తన ఉద్యోగం తీసివేయమని పై అధికారికి ఒత్తిడి చేసి తీసివేయించారని, ఆయన మనిషిని తాను కాదంట అని అందుకే నన్ను తీసివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోవడంతో తన కుటుంబం రోడ్డున పడిందని ఆందోళన వ్యక్తం చేశాడు. శివకుమార్‌ను ఇంకా తీసివేయలేదని ఎప్రిల్ ఒకటో తేదీ వరకు చూస్తామని, ఊరికే తిరగడానికి పెట్టుకున్నామని మాకు అవసరం ఉంటే ఉంచుంకుంటాం లేకుండా తీసివేస్తామని గోదాం సూపర్‌వైజర్ దేవేందర్‌సింగ్ తెలిపారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: