ముస్లిం టోపీతో పోలీస్ అధికారి ఈద్ ముబారక్

హైదరాబాద్: రంజాన్ సందర్భంగా ఓ సిఐ విధులో ఉండగా ముస్లింల తరహా టోపీ ధరించి వివాదాస్పదంగా మారాడు. ఫలక్ నూమ సిఐ కె. శ్రీనివాస్ రావు ముస్లింల మాదిరగా టోపీ ధరించి ఈద్ శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో సదరు పోలీస్‌పై బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ మండిపడ్డాడు. సిఐ ఫోటోను తన ట్వీట్టర్ లో డిజిపి మహేందర్ సింగ్, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్‌లకు ట్వీట్ చేశారు. విధుల నిర్వహిస్తున్న పోలీస్ ఖాకీ టోపీ తీసేసి ఓ మతానికి […] The post ముస్లిం టోపీతో పోలీస్ అధికారి ఈద్ ముబారక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: రంజాన్ సందర్భంగా ఓ సిఐ విధులో ఉండగా ముస్లింల తరహా టోపీ ధరించి వివాదాస్పదంగా మారాడు. ఫలక్ నూమ సిఐ కె. శ్రీనివాస్ రావు ముస్లింల మాదిరగా టోపీ ధరించి ఈద్ శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో సదరు పోలీస్‌పై బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ మండిపడ్డాడు. సిఐ ఫోటోను తన ట్వీట్టర్ లో డిజిపి మహేందర్ సింగ్, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్‌లకు ట్వీట్ చేశారు. విధుల నిర్వహిస్తున్న పోలీస్ ఖాకీ టోపీ తీసేసి ఓ మతానికి ప్రతీకగా ఉన్న టోపీ ఎలా ధరించారని రాజాసింగ్ ప్రశ్నించారు. సదరు పోలీస్ అధికారి 1954 చట్టం ప్రకారం డ్రెస్ కోడ్ ఉల్లంఘించాడన్నారు. గణేష నిమజ్జనం, దీపావళి పండుగల ఊరేగింపుల సందర్భంగా యువకులపై పోలీసులు లాఠీలు ఝులపిస్తారని, మైనార్టీలపై అంత ప్రేమ ఎందుకని  అడిగారు.

 

The post ముస్లిం టోపీతో పోలీస్ అధికారి ఈద్ ముబారక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: