పుట్టగొడుగుల్లా విత్తన దుకాణాలు…

  కొండమల్లెపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో పల్లి విత్తనాల విక్రయ దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్నాయి. ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతన్నను వ్యాపారులు, దళారులు అడుగడునా దోచుకుంటున్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇలా ఒకటేమిటి సర్వం కల్తీమయంగా మార్చేశారు. వ్యవసాయాధికారుల తనిఖీలు అంతంత మాత్రంగానే ఉండడంతో వ్యాపారులు యథేచ్చగా కల్తీలకు తెగబడుతున్నారు. ఫలితంగా రైతులు, తెలిసి తెలియక నమ్మి కోనుగోలు చేసి పొలంలో వేసిన తర్వాత విత్తనాలు మొలకెత్తకా, చేనులో వేసిన ఎరువుకు పంటలు ఎదగకపోవడంతో ఏటా […] The post పుట్టగొడుగుల్లా విత్తన దుకాణాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొండమల్లెపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో పల్లి విత్తనాల విక్రయ దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్నాయి. ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతన్నను వ్యాపారులు, దళారులు అడుగడునా దోచుకుంటున్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇలా ఒకటేమిటి సర్వం కల్తీమయంగా మార్చేశారు. వ్యవసాయాధికారుల తనిఖీలు అంతంత మాత్రంగానే ఉండడంతో వ్యాపారులు యథేచ్చగా కల్తీలకు తెగబడుతున్నారు. ఫలితంగా రైతులు, తెలిసి తెలియక నమ్మి కోనుగోలు చేసి పొలంలో వేసిన తర్వాత విత్తనాలు మొలకెత్తకా, చేనులో వేసిన ఎరువుకు పంటలు ఎదగకపోవడంతో ఏటా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. లైసెన్స్‌లు లేకున్నా దళారులు ఏకంగా తమ ఇండ్లలోనే క్వింటాళ్ల కొద్ది నిల్వలు పెట్టుకుని విక్రయాలు జరుపుతున్నారు. దేవరకొండ డివిజన్ పరిధిలో యేటా పత్తిసాగు గణనీయంగా పెరుగుతోంది.

రైతుల అవసరాల దృష్టా దళారులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో తెచ్చి నిల్ల చేస్తున్నారు. అమాయక రైతులు అవి నాణ్యమైనవా.. లేక నకిలీవా అనే విషయం తెలుసు కోకుండానే కోనుగోలు చేస్తున్నారు. డివిజన్ పరిధిలోని చాల గ్రామాల్లో రైతులు తమ పొలాలను విత్తనాలు వెయడానికి సిద్దం చేసుకున్నారు. దుక్కులు దున్నినా పొలాన్ని బట్టి వ్యవసాయాధికారులు డివిజన్ పరిధిలో ఈ యేడాది వేలాది హెక్టర్లకుపైగా పత్తి సాగయ్యే అవకాశమున్నట్లు అంచన వేశారు. అనుమతులున్న ఫర్టిలైజర్ దుకాణ యజమానులకు అవసరమైన స్టాక్ తెచ్చి పెట్టుకోవాలని సూచించారు.

వివిధ రాష్ట్రాల నుంచి విత్తనాలు సరఫరా

మహరాష్ట్రతో పాటు గుజరాత్, ఆంద్రాలోని వివిధ ప్రాంతాల నుంచి విత్తనాలను దళారులు తీసుకొచ్చి ముందుగానే అడ్వాన్స్‌గా నగదు డబ్బులు తీసుకొని ఇష్టారీతిన విక్రయిస్తున్నారు. అనుమతులు లేకున్నా దళారులు ఇండ్ల వద్దనుండే విక్రయాలు జరుపుతున్నారు. నిబంధనల మేరకు బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ ధర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రూ. 930 ఉంటుంది, కానీ పలు రకాల కంపెనీల పేరుతో పత్తి విత్తనాలను తెస్తున్న దళారులు రూ. 800కే విక్రయిస్తున్నారు. ఇలా తక్కువ ధరలకు ఎరువుపై దొరికే విత్తనాలతో రైతులు ప్రతియేటా నష్టపోతున్నారు. దళారుల విక్రయించే విత్తనాలు నాణ్యమైనవి కాకపోవడంతో పంట ఏపుగాపెరగడం, పూత కాతా లేకపోవడం జరుగుతోంది. వీరిని కట్టడి చేయడంలో వ్యవసాయాధికారులకు తలకుమించిన భారం అవుతుంది. వ్యవసాయాధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన నాణ్యమైన విత్తనాలను లైసెన్స్‌లున్న దుకాణ యాజమానులే విక్రయించాలి. కానీ దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా పలు గ్రామాల్లో దళారులు జోరుగా పత్తి విత్తనాలు అమ్ముతున్నా అధికారుల నిఘా కొరవడడంతో రైతులకు శాపంగా పరిణ మించిందనే చెప్పాలి.అంతే కాకుండా విత్తనాలు, ఎరువులు కోనుగోలుకు దుకాణాలకు వెళ్లే పదుల సంఖ్యలో వివిధ రకాల కంపెనీల విత్తనాలు, ఎరువులు కనిపించడంతో రైతులు ఏవి మంచివో తెలియకుండా పోయాయని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి మండలంలో అనుమతి లేకుండా వెలిసిన దుకాణాలపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Fake Seed Shops should be Banned

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పుట్టగొడుగుల్లా విత్తన దుకాణాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: