ఆదిలాబాద్ జిల్లాలో విస్తరిస్తున్న నకిలీ విత్తన రాకెట్

ఆదిలాబాద్ :  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తన రాకెట్‌ను నడిపిస్తున్న ముఠా పెట్రేగిపోతుంది. గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతూ వస్తున్న ఈ ముఠా రైతుల నిరక్షరాస్యత, బలహీనతను సొమ్ము చేసుకుంటూ కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదిస్తూ దగా చేస్తుంది. ఇప్పటికే జిల్లా నుంచి ఈ నకిలీ విత్తనాలు సరిహద్దుల గుండా భారీ ఎత్తున చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం విజిలెన్స్ అధికారులు జిల్లాలోని పలు చోట్ల […] The post ఆదిలాబాద్ జిల్లాలో విస్తరిస్తున్న నకిలీ విత్తన రాకెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్ :  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తన రాకెట్‌ను నడిపిస్తున్న ముఠా పెట్రేగిపోతుంది. గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతూ వస్తున్న ఈ ముఠా రైతుల నిరక్షరాస్యత, బలహీనతను సొమ్ము చేసుకుంటూ కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదిస్తూ దగా చేస్తుంది. ఇప్పటికే జిల్లా నుంచి ఈ నకిలీ విత్తనాలు సరిహద్దుల గుండా భారీ ఎత్తున చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం విజిలెన్స్ అధికారులు జిల్లాలోని పలు చోట్ల దాడులు జరిపి నకిలీ విత్తనాలను పట్టుకున్నప్పటికీ ఇంకా పరిస్థితిలో మార్పు రాక పోవడం ఆందోళన రేకెత్తిస్తోందని అంటున్నారు. తాజాగా నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను తయారు చేసేందుకు వినియోగించే ఖాళీ కవర్లు, పత్తి గింజలకు వేసే రంగులను నేరడిగొండ పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. విత్తనాలను విక్రయించే దుకాణాలను వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ గ్రామాల్లోనే తిష్ట వేస్తున్న ఈ ముఠా సభ్యులు గ్రామంలో ఒకరిద్దరిని మచ్చిక చేసుకొని నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతూ మోసం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో పత్తి, సోయాబీన్ విత్తనాలకు భారీగా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొంత మంది వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి నకిలీ దందా నెట్‌వర్క్‌ను ఉమ్మడి జిల్లా అంతటికీ విస్తరింప చేస్తున్నారు. కొన్ని అన్ బ్రాండెడ్ విత్తనాలతో పాటు బ్రాండెడ్ కంపెనీలను పోలిన రీతిలో ఉన్న విత్తనాలను జిల్లాకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ప్రభుత్వం నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే పిడి యాక్టును అమలు చేసేందుకు వెనుకాడబోమంటూ హెచ్చరిస్తున్నప్పటికీ వ్యాపారుల్లో మార్పు కనిపించక పోవడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.  కొంతమంది అధికారుల అండదండలతోనే ఈ నకిలీ విత్తన వ్యాపారాన్ని యధేచ్చగా కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అమాయక రైతాంగాన్ని టార్గెట్‌గా చేసుకుంటూ ఈ నకిలీ విత్తనాలను అట్టగడుతున్నారని అంటున్నారు. అయితే ఈ విత్తనాలను సాగు చేసే రైతులకు పంట నష్టం జరగడం రివాజుగా మారింది. గత కొద్ది సంవత్సరాల నుంచి ఇలాంటి నకిలీ విత్తనాలను సాగు చేస్తున్న రైతులు పెద్ద ఎత్తున నష్టాల పాలయ్యారు. అయితే అధికారులు ఈ నష్టాలపైన నకిలీ విత్తనాల పైన కంటితుడుపు చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారే తప్ప ఈ దందా మూలాలను తొలగించే ప్రయత్నాలు చేయక పోవడం రైతులకు శాపంగా మారిందని అంటున్నారు. నకిలీ వ్యాపార సిండికేట్ పెద్ద ఎత్తున కల్తీ విత్తనాల దిగుమతికి నడుం బిగించిందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఈ నకిలీ విత్తనాలు జిల్లాకు చేరుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. పత్తి, సోయాబీన్ ఎక్కువగా సాగయ్యే ప్రాంతాలను ఈ వ్యాపార సిండికేట్ లక్ష్యంగా చేసుకుందని చెబుతున్నారు. భైంసా డివిజన్‌లో నాందేడ్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఈ నకిలీ విత్తనాలు సరిహద్దులు దాటుతున్నాయని అంటున్నారు. అలాగే ఆదిలాబాద్ ప్రాంతంలోకి నాగ్‌పూర్, యవత్‌మాల్‌ల నుంచి ఈ నకిలీ రాకెట్ కొనసాగుతుందని అంటున్నారు. అలాగే ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ప్రాంతాలకు చంద్రపూర్, బల్లార్షాల నుంచి నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున అడ్డదారిలో దిగుమతి అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ నకిలీ వ్యాపారుల సిండికేట్ పథకం ప్రకారం దుకాణాల్లో కాకుండా రహస్య ప్రదేశాల్లోని గిడ్డంగులలో వీటిని భద్ర పర్చుతూ అదికారుల కళ్లు కప్పి గుట్టుచప్పుడు కాకుండా పల్లెలకు తరలిస్తున్నారన్న విమర్శలున్నాయి. అయితే ఈ వ్యాపారుల రాకెట్ నకిలీ విత్తనాలను అమ్ముకొనేందుకు దళారులను సైతం రంగంలోకి దింపి వారికి భారీగా కమీషన్లు, ఇన్సెంటివ్‌లు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలు, ఆకట్టుకొనే రీతిలో మాటలతో ఈ దళారులు రైతులను బుట్టలో వేసుకుంటున్నారన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగం ఇటువైపు దృష్టి సారించనట్లయితే మరోసారి నకిలీ ఉపద్రవం రైతును నట్టేట ముంచే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.

Fake Seed Rocket Expanding In Adilabad District

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆదిలాబాద్ జిల్లాలో విస్తరిస్తున్న నకిలీ విత్తన రాకెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: