నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు: మంచు మనోజ్

హైదరాబాద్: తన ఓటరు ఐడి కార్డుపై వస్తున్న వార్తలపై నటుడు మంచు మనోజ్ స్పందించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీ చిరునామాతో మంచు మనోజ్‌కు గుర్తింపు కార్డు ఉందని ప్రచారం చేసింది. దీంతో మనోజ్ తన ట్వీట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఫిల్మ్‌నగర్‌లోని నా ఇంటి చిరునామాతో తనకు ఓటరు ఐడి కార్డు ఉందని, ఈ వార్తల్లో పుకారు ఉందన్నారు. ఈ విషయంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని రోజుల క్రితం మంచు మనోజ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సమాజసేవలో పాల్గొంటానని చెప్పారు. దీంతో ఆయన రాజకీయాల్లో ఆరంగ్రేటం చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.

 

Fake news on My Voter Card: Manchu Manoj

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు: మంచు మనోజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.