చర్మానికి సహజ మెరుపు…!

Skin

 

వర్షాకాలం వాతావరణంలోని తేమ, చల్లదనం వల్ల చర్మం సహజ మెరుపును కోల్పోతుంది. జిడ్డుగా తయారవటం, మొటిమలు రావటంలాంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా వేధిస్తుంటాయి. వీటి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన ఫేస్‌ప్యాక్స్ వేయాలి.

శాండిల్‌వుడ్ ప్యాక్ ఒకటే. స్పూను గంధం పొడి, పావు కప్పు రోజ్ వాటర్, పావు టీస్పూను పసుపు. అన్నిటినీ కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. ముఖానికి అప్లై చేసి 30 నిమిషాలాగి చల్ల నీళ్లతో కడిగేసుకోవాలి. ఓట్‌మీల్ ప్యాక్ 3 ఓట్‌మీల్, ఒక ఎగ్ వైట్, ఒక టీస్పూను తేనె, ఒక టీస్పూను పెరుగులో పైవన్నీ కలిపి ఫ్రిజ్‌లో చల్లబరచాలి. ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ఈ ప్యాక్ అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి.

బనానా ప్యాక్ అరటి పండు, గుప్పెడు పుదీనా ఆకుల్ని మెత్తగా దంచాలి. అరటి పండు గుజ్జుకు పుదీనా పేస్ట్ కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. లెమన్ బ్లీచ్ ముల్లంగి కోరుకు నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల అనంతరం వేళ్లతో గుండ్రంగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.

 

Face packs for Natural glow on Skin

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చర్మానికి సహజ మెరుపు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.