బ్యాంకుల నుంచి వేగంగా రేటు తగ్గింపును ఆశిస్తున్నాం

  ఆర్థిక మంత్రితో భేటీ అనంతరం ఆర్‌బిఐ గవర్నర్ వెల్లడి న్యూఢిల్లీ: ఆర్‌బిఐ ఇటీవల సమీక్షలో తగ్గించిన వడ్డీ రేటు కోతను బ్యాంకులు తక్షణమే బదిలీ చేయాలని ఆశిస్తున్నామని, దీని ద్వారా వినియోగదారులకు గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు చౌక కానున్నాయని సోమవారం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆర్‌బిఐ మూడు సార్లు రేట్లను తగ్గించిందని, మొత్తంగా 0.75 మేరకు రెపో రేటు తగ్గిందని ఆయన వెల్లడించారు. బడ్జెట్ అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి […] The post బ్యాంకుల నుంచి వేగంగా రేటు తగ్గింపును ఆశిస్తున్నాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆర్థిక మంత్రితో భేటీ అనంతరం ఆర్‌బిఐ గవర్నర్ వెల్లడి

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ ఇటీవల సమీక్షలో తగ్గించిన వడ్డీ రేటు కోతను బ్యాంకులు తక్షణమే బదిలీ చేయాలని ఆశిస్తున్నామని, దీని ద్వారా వినియోగదారులకు గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు చౌక కానున్నాయని సోమవారం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆర్‌బిఐ మూడు సార్లు రేట్లను తగ్గించిందని, మొత్తంగా 0.75 మేరకు రెపో రేటు తగ్గిందని ఆయన వెల్లడించారు. బడ్జెట్ అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో శక్తికాంత దాస్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వ్యవస్థలో తగినంతగా లిక్విడిటీ ఉందని, ఎన్‌బిఎఫ్‌సి(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు)కు బడ్జెట్ 201920లో కేటాయింపు చేసిందని అన్నారు.

బ్యాంకులు వ్యక్తిగతంగా సమస్య ఉండే ఆర్‌బిఐ తగినన్ని నిధులుచ్చి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ఎన్‌బిఎఫ్‌సిలను తాము సమీక్షిస్తున్నామని, వాటి పనితీరును గమనిస్తున్నామని అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్ల మూలధనం కేటాయించడం చాలా సానుకూల పరిణామమని, ఇది నియంత్రణ అవసరాలకే కాకుండా బ్యాంకింగ్‌ను మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. గతవారం బడ్జెట్‌లో ఎన్‌బిఎఫ్‌సి(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై నియంత్రణను ఆర్‌బిఐకి కట్టబెడుతూ నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఇప్పటివరకు -హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నియంత్రణ ఎన్‌హెచ్‌బిలకు ఉండేది.

అయితే ఇప్పటి నుంచి రిజర్వ్ బ్యాంక్ చేతికి ఈ అధికారాలు వెళతాయి. కాగా ప్రభుత్వంతో విదేశీ సార్వభౌమ బాండ్ల జారీపై సెంట్రల్ బ్యాంక్ చర్చించనుందని దాస్ తెలిపారు. దేశీయ తొలి ఓవర్సీస్(విదేశీ) బాండ్ జారీ ప్రణాళికను ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్‌లు సెప్టెంబర్ నాటికి ఖరారు చేయనున్నాయని క్రితం రోజు ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్రగార్గ్ తెలిపారు. పలు వర్ధమాన మార్కెట్ల కంటే క్రెడిట్ రేటింగ్ దిగువన ఉన్నప్పటికీ ప్రధాన దేశాలతో పోల్చదగిన రేట్లను భారత్ ఇవ్వనుందని అన్నారు. సాధారణ రుణ కార్యక్రమంలో భాగంగా విదేశీ కరెన్సీలు, విదేశీ మార్కెట్లలో సమీకరణ చేపట్టనున్నామని అన్నారు.

Expects quicker transmission of rate cut by banks

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బ్యాంకుల నుంచి వేగంగా రేటు తగ్గింపును ఆశిస్తున్నాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.