పక్కా ప్రణాళికతో విజయం

study tipsవిద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివితే పరీక్ష ఫలితాలను శాసించవచ్చు. విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవు తుంటారు. మంచి మార్కులు సాధిం చగలనా? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? సరైన సమాధానాలు రాయగలనా? ఆశించిన మార్కులు రాకపోయినట్లయితే పరిస్థితి ఏమిటీ? ఇలాంటి ప్రశ్నలు మెదళ్లలో కదలాడుతుంటాయి. ప్రణాళిక ప్రకారం చదవడంతో పాటుగా చిన్నచిన్న చిట్కాలను పరీక్ష ఫలితాలను శాసించవచ్చు.

సమాధానాలు రాయడం ఒక కళ ఎంత బాగా చదివినా, ఎంత గుర్తున్నా, రాసే విధానం తెలియక పోతే మంచి మార్కులు సాధించడం కష్టం. చేతి రాత బాగుండాలి, నిర్వచనం ఉంటే యధాతథంగా రాసే ప్రయత్నం చేయాలి. చిన్న ప్రశ్నలకు రాసే సమాధానాలలో ముఖ్యమైన విషయాలు వదలకుండా రాయాలి, జవాబులో నిర్వచనం ఉంటే ముందుగా రాయాలి, సైడ్ హెడ్డింగ్స్ ముఖ్యమైన వాటికి అండర్ లైన్ చేయాలి, అవసరమైన చోట చిత్రపటాలను గీచి, బాగాలు గుర్తించాలి, పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండాలి.
పరీక్షలకు ఎలా చదవాలి:
1. సబ్జెక్టులన్నింటికీ సమయం కేటాయించి ప్రణాళికతో చదవాలి.
2. ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య చదివితే మంచి ఫలితం ఉంటుంది.
3. కష్టమైన, ఇష్టం లేని సబ్జెక్ట్ లకు ఎక్కువ సమయం కేటాయించాలి.4. ప్రతిరోజు అవసరమైనంత నిద్ర పోవాలి
5. ఆహారం విషయంలో శ్రద్ద వహించాలి 6. చల్లని పదార్థాలు తినడం, తాగడం చేయకండి
పరీక్షలకు రెండు రోజుల ముందు:
1. మొదటి పరీక్ష కోసమే చదవాలి 2. గతంలో చదివినంతవరకు మాత్రమే రివిజన్ చేయాలి, కొత్తవి నేర్చుకోవాలని ప్రయత్నించకండి. 3. సరిపడా నిద్ర పోవాలి, కష్టపడి చదవడం వరకు మాత్రమే, కాని ఫలితం మన చేతుల్లో ఉండదని గుర్తించాలి. 4. ఎప్పుడూ సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి.
పరీక్ష రోజున:
1. పరీక్ష సమయానికి కనీసం గంట ముందు చదవడం ఆపండి. 2. పరీక్ష రాయడానికి కావలిసినవి సిద్ధం చేసుకోవాలి 3. స్నేహితులతో సరదాగా మాటలు తప్పించి పరీక్ష గురించి చర్చించకూడదు. 4. పరీక్ష కేంద్రానికి అర గంట ముందుగా చేరాలి.
పరీక్ష హాలులో:
1. 2 నుండి 5 నిముషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. 2. ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలు శ్రద్ధగా విని పాటించాలి. 3. పరీక్షకు సంబందించిన సబ్జెక్ట్ మెటీరియల్, ఇతరాలు చిన్నముక్క కూడా దగ్గర ఉంచుకోకూడదు. 4. ప్రశ్నాపత్రంపై గాని, బెంచ్‌పై గాని, పాడ్‌ల పై గాని ఏమీ రాయకూడదు. తనిఖీ బృందాలు డిబార్ చేస్తారు. 5. ప్రశ్నాపత్రం శ్రద్దగా చదవాలి. 6. తేలికగా ఉన్న ప్రశ్నకు సమాధానం మొదటగా వ్రాయాలి. 7. మొదటి పేజీ అందంగా రాసే ప్రయత్నం చేయాలి 8. ప్రశ్నలు కష్టంగా అనిపిస్తే కంగారు పడొద్దు, మీకే కాదు, అందరికీ అలాగే అనిపిస్తాయి9. సమాధానాలు రాయడం పూర్తయిన తర్వాత ప్రశ్నల నంబర్లు సరి చూసుకోండి. 9. సమయం మిగిలితే రాసిన సమాధానాలు పున:పరిశీలించుకోవాలి.
పరీక్ష హాలు నుండి బయటకు వచ్చాక:
స్నేహితులతో తప్పొప్పుల గురించి చర్చించకూడదు. 2. ఆహారం తీసుకొని, కొంత సమయం విశ్రాంతి తీసుకుని తరువాతి పరీక్షకు ప్రిపరేషన్ కావాలి.
అన్ని పరీక్షలు అయిన తర్వాత:
నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఫలితం నా చేతుల్లో లేదనుకోవాలి.
ఫలితాలు విడుదల అయిన తర్వాత:
వచ్చిన మార్కులను బట్టి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ఫెయిలైన విద్యార్థులు, చదువు జీవితంలో ఒక భాగమని, మంచిగా బతకడానికి చాలా మార్గాలున్నాయని అర్థం చేసుకోవాలి. చావడం అనేది మూర్ఖులు మాత్రమే చేస్తారు, తెలివి గల వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.

లక్ష్య సాధనలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటికి ఎదురీదుతూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లినవారే ప్రపంచ విజేతలు అవుతారు. ఒక అంశం నేర్చుకోవాలనుకున్నప్పుడు అది ఎంత కఠినమైనా కానీ ఆ అంశం సాధన దిశగా మిత్రులతో చర్చించి విజేతల, సీనియర్ల సలహాలను తీసుకొని ముందుకు వెళ్తే మీ లక్ష్యం మీకు దాసోహం అవుతుంది.
నీ వెనుక ఏముంది… ముందేముంది..అనేది నీ కనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. నీ శక్తి సామర్థాలతో లక్ష్యాన్ని సాధించాలి. ఇలా ఎందరో సాధించారు మనమూ సాధిద్దాం ఇతరులకూ
స్ఫూర్తినిద్దాం.

డా అట్ల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
Exam Preparation Tips for Students

Related Images:

[See image gallery at manatelangana.news]