ఎపి గవర్నర్ గా సుష్మా…?

ఢిల్లీ : ఎపి గవర్నర్ గా బిజెపి అగ్రనేత, మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ నియమితులు కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎపి , తెలంగాణ రాష్ట్రాలకు నరసింహన్ ఉమ్మడి గవర్నర్ గా ఉన్నారు. సోమవారం నరసింహన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఎపి, తెలంగాణ గవర్నర్ ల నియామకంపై వారి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుష్మాను ఎపి గవర్నర్ గా నియమిస్తే ఏవిధంగా […] The post ఎపి గవర్నర్ గా సుష్మా…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : ఎపి గవర్నర్ గా బిజెపి అగ్రనేత, మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ నియమితులు కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎపి , తెలంగాణ రాష్ట్రాలకు నరసింహన్ ఉమ్మడి గవర్నర్ గా ఉన్నారు. సోమవారం నరసింహన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఎపి, తెలంగాణ గవర్నర్ ల నియామకంపై వారి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుష్మాను ఎపి గవర్నర్ గా నియమిస్తే ఏవిధంగా ఉంటుందన్న చర్చ వారి మధ్య వచ్చినట్టు సమాచారం. ఎపికి గవర్నర్ గా సుష్మా, తెలంగాణకు మాత్రం గవర్నర్ గా నరసింహనే కొనసాగుతారని, నరసింహన్ ను కొనసాగించని పక్షంలో మరో బిజెపి నేతను తెలంగాణ గవర్నర్ గా నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎపి గవర్నర్ గా తాను నియామకమవుతున్నట్టు వస్తున్న వార్తలపై సుష్మా స్పందించారు. తాను ఎపి గవర్నర్ గా నియామకం కానున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె తేల్చి చెప్పారు.

Ex Union Minister Sushma To Be AP Governor

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎపి గవర్నర్ గా సుష్మా…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: