టిఆర్ఎస్ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న కవిత

Ex MP Kavithaహైదరాబాద్‌: నిజామాబాద్‌ మాజీ ఎంపి కల్వకుంట్ల కవితకు టిఆర్ఎస్ క్రీయాశీల సభ్యత్వం తీసుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఆమెకు ఈ సభ్యత్వం అందించారు. హైటెక్స్ లోని కవిత ఇంటికి మంత్రి ప్రశాంత్ వెళ్లి సభ్యత్వం అందించారు. నిజామాబాద్ లో టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుందని మంత్రి ప్రశాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టిఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాలకు మించి ఎక్కువ సభ్యత్వాలు నమోదవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరి సంక్షేమం కోరేది ఒక్క టిఆర్ఎస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

Ex MP Kavitha Taken TRS Active Membership

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిఆర్ఎస్ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న కవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.