టిఆర్‌ఎస్‌లో చేరనున్న మాజీ మంత్రి మండవ

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన టిడిపి అగ్రనేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తాను టిఆర్‌ఎస్‌లో చేరుతానని మండవ వెంకటేశ్వరరావు శుక్రవారం వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి టిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్‌ వెళ్లారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. కెసిఆర్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు మండవ తెలిపారు. శుక్రవారం ఉదయం మండవ వెంకటేశ్వరరావును టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్‌, పువ్వాడ అజయ్‌ […] The post టిఆర్‌ఎస్‌లో చేరనున్న మాజీ మంత్రి మండవ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన టిడిపి అగ్రనేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తాను టిఆర్‌ఎస్‌లో చేరుతానని మండవ వెంకటేశ్వరరావు శుక్రవారం వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి టిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్‌ వెళ్లారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. కెసిఆర్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు మండవ తెలిపారు. శుక్రవారం ఉదయం మండవ వెంకటేశ్వరరావును టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్‌, పువ్వాడ అజయ్‌ కలిశారు. మండవ వెంకటేశ్వరరావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు హయాంలో  మంత్రిగా కూడా పని చేశారు. మండవ చేరికతో నిజామాబాద్ లో టిఆర్ఎస్ మరింత బలోపేత కానుందని  ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Ex Minister Mandava Venkateswara Rao Joins TRS

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిఆర్‌ఎస్‌లో చేరనున్న మాజీ మంత్రి మండవ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: