అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో భద్రం

  నిజామాబాద్: జిల్లాలోని పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవిఎంల్లో నిక్షిప్తం కాగా ఆ ఈవిఎంలు పోలీసు పహరా మధ్య స్థానిక విఆర్‌కె ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో అధికారులు భద్రపరిచారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 178 మంది పసుపు, చెరుకు, మొక్కజొన్న రైతులు ఉండగా మిగతా 8 మంది వివిధ పార్టీలకు చెందిన వారు ఉన్నారు. జిల్లాలో మొత్తం 6,63,231 మంది […] The post అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో భద్రం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిజామాబాద్: జిల్లాలోని పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవిఎంల్లో నిక్షిప్తం కాగా ఆ ఈవిఎంలు పోలీసు పహరా మధ్య స్థానిక విఆర్‌కె ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో అధికారులు భద్రపరిచారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 178 మంది పసుపు, చెరుకు, మొక్కజొన్న రైతులు ఉండగా మిగతా 8 మంది వివిధ పార్టీలకు చెందిన వారు ఉన్నారు. జిల్లాలో మొత్తం 6,63,231 మంది ఓటర్లు ఉండగా ఇందులో 3,21,370 మంది పురుషులు, 3,41,851 మంది మహిళలతో పాటు ఇతరులు పది మంది ఉన్నారు. జిల్లాలో 785 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 బ్యాలెట్ యూనిట్లు, ఒక కంట్రోల్ యూనిట్, ఒక వివిప్యాట్ చొప్పున జిల్లాలో మొత్తం 7,490 బ్యాలెట్ యూనిట్లు, 863 కంట్రోల్ యూనిట్లు, 863 వివిప్యాట్‌లను ఉపయోగించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా 185 మంది పోటీలో నిలవడం… దాంతో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 ఈవిఎంలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అయితే టిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కల్వకుంట్ల కవిత ప్రచారంలో దూసుకుపోగా మిగతా కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. కవిత ప్రచారానికి తోడు ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉండడంతో ప్రతి పోలింగ్ బూత్ వద్ద వారి సందడి కనిపించింది. అయితే పోలింగ్ శాతం తగ్గడంతో పాటు అధిక సంఖ్యలో ఈవిఎంలు ఉన్నందున ఓట్లు చాలా వరకు క్రాస్ అయ్యాయని, అన్ని పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

టిఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలుస్తుందని ఎన్నికల ప్రచారానికి గ్రామాలకు వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆ పార్టీ నేతలు గంటాపథంగా చెబుతున్నారు. కాగా దేశంలో నరేంద్రమోడీ గాలి వీస్తున్న నేపథ్యంలో బిజెపి అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక సంఖ్యలో రైతులు నామినేషన్ వేసినందున రైతుల ఓట్లన్నీ చీలిపోతాయని, దాంతో గెలుపోటములపై రైతుల నామినేషన్ల ప్రభావం చూపిస్తుందంటూ అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా అభ్యర్థుల భవితవ్యం ఈవిఎంల్లో నిక్షిప్తం కాగా తుది ఫలితం తేలాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.

EVMs in Strong rooms at VRK Engineering College

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో భద్రం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: