గ్రామంలో ఉన్న వారికి చెత్తను వేరుచేసే పద్ధతులను వివరించాలి…

 Garbage

 

ప్రతి ఒక్కరు చెత్త ఉత్పాదనపై దృష్టి సారించాలి
జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి

మెదక్ : జిల్లాలోని ప్రతి గ్రామం సంపూర్ణ పారిశుద్యం, ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్వచ్చభారత్/స్వచ్చమెదక్ కార్యక్రమ అమలుపై ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతోపాటు రిసైక్లింగ్ చేసేందుకుగాను గ్రామంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే కార్యక్రమం అన్ని గ్రామాల్లో చురుకుగా సాగాలన్నారు.

ఇప్పటికే మండలాల్లో కొన్ని గ్రామాల్లో ప్రారంభం అయిందని దీనిని అన్ని గ్రామాలకు విస్తరించాలన్నారు. అలాగే గ్రామ పంచాయతీ పరిధిలోని కు టుంబాల నుంచి చెత్తను సేకరించేందుకుగాను ప్ర త్యేకంగా సిబ్బందిని నియమించుకోవాలని ఇప్పటికే ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికి సిబ్బందిని గుర్తించని ప్రాంతాల్లో తక్షణం గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలా గే గ్రామంలో ఉన్న వారికి చెత్తను వేరుచేసే పద్దతులను వివరించి వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఒక ఉద్యమంలా విస్తృత కార్యక్రమాలను చేపట్టి చెత్త రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి అధికారి శక్తివంచన లేకుండా కృషిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

అనంతరం హైదరాబాద్ ఐటిసి లిమిటెడ్ కంపెనీ నుంచి చెత్త సేకరణ, రీసైక్లింగ్ ఎలా చేపట్టాలనే అంశంపై కంపెనీ సీనియర్ మేనేజర్ ఉమాకాంత్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన దేశంలో ప్రతిరోజు 1.6 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి జరుగుతు ందని, ఇందులో 48వేల మెట్రిక్ టన్నుల మేర ప్లా స్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయని ఆయన తెలిపారు. ప్రతి రోజు వస్తున్న చెత్తను నిల్వ చేసేందుకు గాను 40 ఎకరాల స్థలం అవసరం అవుతుందని ఇది ఇలాగే జరిగితే భవిష్యత్తులో ఖాళీగా ఉన్న ప్రదేశం మొత్తం చెత్తతో నిండిపోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు చెత్త ఉత్పాదనపై దృష్టిసారించాల్సిన సమయం అసన్నమైందన్నా రు.

రోజు ఉత్పత్తి అయ్యే వర్థాలతో 60శాతం మేర భూమిలో కలిసిపోయేవి ఉంటాయని, 30శాతం పేపర్, మెటల్, ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండగా 5శాతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలు మరో 5 శాతం మెడికల్ వ్యర్థాలుగా ఉండటం జరుగుతుందన్నారు. భూమిలో కలిసిపోయే వ్యర్థాలను వర్మి కంపోస్టు ఎరువుగా మార్చుకునే అవకాశం ఉందన్నారు. చెత్త తీసుకునే పోయే పారిశుద్య కార్మికులకు సైతం చెత్తను ఎలా వేరు చేయాలనే అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ముందుగా ప్రతి అధికారి తమ గ్రామంలో ఉన్న ఇళ్ల సంఖ్య, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ఫంక్షన్ హాల్‌లలో ఉత్పత్తి అయ్యే చెత్తను అంచనా వేసి వాటిని సేకరించేందుకు కావాల్సిన సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.

గ్రామంలో రోడ్లు శుభ్రపరిచేందుకు ఇంటింటి చెత్త సేకరణకు ప్రత్యేకంగా సిబ్బంది ఉన్నప్పుడు ఈ కార్యక్రమం సులభమవుతుందన్నారు. ప్రతి గ్రామ ం లో ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేయాలని, వచ్చిన వ్యర్థాలను అక్కడ వేరు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికా రి సీతారామారావు, డీపీఓ హనోక్, మున్సిపల్ అ డ్మినిస్ట్రేషన్ కమిషనరేట్ అధికారి బషీర్‌తోపాటు ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రకాశ్, జిల్లా అధికారులు పద్మజారాణి, జ్యోతిపద్మ, సుధాకర్, దేవ య్య, వ సంతరావు, శ్రీనివాసులు, యేసయ్య, తిరుపత య్య, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డి, మెదక్ మున్సిపల్ కమీషనరు సమ్మయ్యతోపాటు ఎంపీడీవోలు, ఎపీఓలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Everyone should focus on Garbage Production

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గ్రామంలో ఉన్న వారికి చెత్తను వేరుచేసే పద్ధతులను వివరించాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.