సంపద సృష్టిలో సమిధలు

Industrial Accidents

 

పారిశ్రామిక ప్రమాదాల పరంపర

దేశంలో ఏటా సుమారు 48,000 మంది కార్మికులు పారిశ్రామిక ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంటే రోజుకు 132 మంది. దీన్ని నిమిషాల్లోకి మారిస్తే, ప్రతి పది నిమిషాలకు ఒక కార్మికుడు, దేశ సంపదను పెంచడంలో సమిధగా మారుతున్నాడు. దేశంలో పారిశ్రామిక ప్రమాదాలలో మరణిస్తున్న వారి సంఖ్య, బ్రిటన్‌లో పారిశ్రామిక ప్రమాదాలలో మరణిస్తున్న వారి కంటే 20 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ మరణాల్లో 24% ఒక్క నిర్మాణ రంగలో జరుగుతున్నాయి. దేశంలో ఉన్న 46.5 కోట్ల మంది శ్రామికులలో 80% మంది ఆరోగ్యమైన, భద్రతా పరమైన సౌకర్యానికి నోచుకోనివారే. దాదాపు 506 రిజిస్టర్ద్ పరిశ్రమలకు ఒకే ఒక్క కంపెనీ ఇన్స్‌పెక్టర్ ఉన్నారు.

సంస్కరణలలో భాగంగా కొత్త విధానాలను రూపొందించారు. పరిశ్రమల ఏర్పాటుకు సెల్ఫ్ సర్టిఫికేషన్ సరిపోతుందని చెప్పారు. అప్పుడు ప్రధాని మోది, సెల్ఫ్ సర్టిఫికేషన్ ను సమర్థించారు. మనం కారు కొన్నప్పుడు, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ అడుగుతామా? అలాగే ఒక పరిశ్రమను ఏర్పాటు చేయా లనుకొన్నప్పుడు థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఎందుకు? అని వివరించారు. కనీస ఆలోచన లేకుండా చూసే వారికి ఇది నిజమే అని నమ్మించడానికి చెప్పిన విషయం ఇది. ఎందుకంటే, పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు యజమానులు కాదు కార్మికులు చనిపోతారు. కారు ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువభాగం యజమానులు చనిపోతారు అన్న కనీస పరిజ్ఞానం ప్రధానికి లేదు అనుకోలేము. వారు పరిశ్రమల నిర్వహణను పట్టించుకోవాల్సిన సంస్థలను, అవసరమైన సర్టిఫికేట్లను పరిశ్రమల వారికి ఇచ్చే పోస్టల్ డిపార్ట్‌మెంట్స్‌గా మార్చారు.

హర్యాణా లోని గుర్‌గావ్‌లో, మారుతి సుజుకి ఫ్యాక్టరీలో కార్మికులు చేస్తున్న నిరసన ప్రదర్శనను ఫ్యాక్టరీ యాజమాన్యం హింసాయుతంగా మార్చిన ఘటనలో మరణించిన కంపెనీ పర్సనల్ మేనేజర్ మరణానికి బాధ్యులను చేస్తూ 13 మంది కార్మికులకు సెషన్స్ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను మరణశిక్షగా మార్చాలని హర్యాణాలోని బిజెపి ప్రభుత్వ ప్రతినిధి కోరారు. ఉదయం లేచిన దగ్గరినుండి దేశభక్తి ప్రకటనలు చేసే వీరు ఎందుకు ఇలా అడుగుతున్నారని అనుమానం వచ్చిందేమో, సెషన్స్ కోర్ట్ వారు, మీరు ఎందుకు కార్మికులకు మరణశిక్షను విధించమని కోరుతున్నారు? అని, ప్రత్యేక ప్రాసిక్యూటర్ అనురాగ్ హూదాను అడిగారు. అప్పుడు ప్రాసిక్యుటర్, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది. విదేశీ పెట్టుబడులు తగ్గాయి. ఈ ఘటన భారత ప్రతిష్ఠకు భంగం కలిగించింది అని చెప్పారు. వీరికి కార్మికుల ప్రాణాల పట్ల ఉన్న ప్రేమ ఇది.

ప్రపంచ బ్యాంక్ రూపొందించిన, సులభతర వాణిజ్యం చేస్తున్న దేశాల జాబితాల ర్యాంక్ లో, 2018 లో, మన దేశం 30 స్థానాలు ముందుకు వెళ్లి, 70 వ స్థానానికి చేరుకుందని పాలకులు మురిసిపోతున్నారు. వ్యాపార ప్రారంభంలో సౌలభ్యం, నిర్మాణ పరిమితులు, విద్యుత్ కనెక్షన్ పొందడం, రుణాలు పొందడం, పన్ను చెల్లింపు, ఇతర అనుమతుల విషయంలో, ఆయా దేశాలు ఇచ్చే సౌలభ్యతను ఆధారం చేసుకొని, ప్రపంచ బ్యాంక్ సులభతర వాణిజ్య ర్యాంక్ ఇస్తుంది. ఈ ర్యాంక్ ను మెరుగు పరుచుకోవడం కోసం మరిన్ని సంస్కరణలు తేవడం ద్వారా, స్వదేశీ లేదా విదేశీ పారిశ్రామికధిపతుల పెట్టుబడులకు ఎటువంటి ‘ఆటంకాలు’ ఉండకుండా చేయడం, వారు తమ వ్యాపారాలను లాభదాయకంగా నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని పనులు చేయడం, పాలకులు తమ ప్రధాన కర్తవ్యాలలో ఒకటిగా చేసుకున్నారు. అటు కేంద్ర పాలకులు కాని, ఇటు రాష్ట్ర పాలకులు కాని, సుభతర వాణిజ్యం, పారిశ్రామిక ఉత్పత్తి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరగడం తమ పనితీరు సూచికలో ఒక ప్రధాన లక్షంగా నిర్దేశించుకున్నారు. ఇందులో, ఉత్పత్తికి గుండెకాయ అయిన కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమానికి స్థానం లేకపోవడం బాధాకరమైన విషయం.

సులభతర వాణిజ్యంలో తమకు మెరుగయిన ర్యాంక్ వచ్చిందని సంబరంలో మునిగిన పాలకులు, ఆడిటింగ్ లో, శిక్షణలో, ఈ లర్నింగ్ లో గత 30 సంవత్సరాలుగా మన దేశంలో పనిచేస్తున్న బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్ (ఇండియా) దేశంలో కార్మికుల స్థితిగతుల గురించి 2017 వ సంవత్సరంలో ఇచ్చిన నివేదికను వినిపించుకోలేదు. ఆ నివేదిక ప్రకారం, దేశంలో ఏటా సుమారు 48,0 00 మంది కార్మికులు పారిశ్రామిక ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంటే రోజుకు 132 మంది. దీన్ని నిమిషాల్లోకి మారిస్తే, ప్రతి పది నిమిషాలకు ఒక కార్మికుడు, దేశ సంపదను పెంచడంలో సమిధగా మారుతున్నాడు. దేశంలో పారిశ్రామిక ప్రమాదాలలో మరణిస్తున్న వారి సంఖ్య, బ్రిటన్‌లో పారిశ్రామిక ప్రమాదాలలో మరణిస్తున్న వారి కంటే 20 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ మరణాల్లో 24% ఒక్క నిర్మాణ రంగలో జరుగుతున్నాయి. దేశంలో ఉన్న 46.5 కోట్ల మంది శ్రామికులలో 80% మంది ఆరోగ్యమైన, భద్రతా పరమైన సౌకర్యానికి నోచుకోనివారే. దాదాపు 506 రిజిస్టర్ద్ పరిశ్రమలకు ఒకే ఒక్క కంపెనీ ఇన్స్‌పెక్టర్ ఉన్నారు.

సంస్కరణలలో భాగంగా కొత్త విధానాలను రూపొందించారు. పరిశ్రమల ఏర్పాటుకు సెల్ఫ్ సర్టిఫికేషన్ సరిపోతుందని చెప్పారు. అప్పుడు ప్రధాని మోది, సెల్ఫ్ సర్టిఫికేషన్ ను సమర్థించారు. మనం కారు కొన్నప్పుడు, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ అడుగుతామా? అలాగే ఒక పరిశ్రమను ఏర్పాటుచేయాలనుకొన్నప్పుడు థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఎందుకు? అని వివరించారు. కనీస ఆలోచన లేకు ండా చూసే వారికి ఇది నిజమే అని నమ్మించడానికి చెప్పిన విషయం ఇది. ఎందుకంటే, పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు యజమానులు కాదు కార్మికులు చనిపోతారు. కారు ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువభాగం యజమానులు చనిపోతారు అన్న కనీస పరిజ్ఞానం ప్రధానికి లేదు అనుకోలేము. వారు పరిశ్రమల నిర్వహణను పట్టించుకోవాల్సిన సంస్థలను, అవసరమైన సర్టిఫికేట్లను, పరిశ్రమల వారికి ఇచ్చే పోస్టల్ డిపార్ట్ మెంట్స్ గా మార్చారు.

హర్యాణా లోని గుర్ గావ్ లో, మారుతి సుజికి ఫ్యాక్టరీలో, కార్మికులు చేస్తు న్న నిరసన ప్రదర్శనను, ఫ్యాక్టరీ యాజమాన్యం హింసాయుతంగా మార్చిన ఘటనలో మరణించిన కంపెనీ పర్సనల్ మేనేజర్ మరణానికి బాధ్యులను చేస్తూ 13 మంది కార్మికులకు సెషన్స్ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను మరణశిక్షగా మార్చమని, హర్యాణా లోని బీ జే పి ప్రభుత్వ ప్రతినిధి కోరారు. ఉదయం లేచిన దగ్గరినుండి దేశభక్తి ప్రకటనలు చేసే వీరు ఎందుకు ఇలా అడుగుతున్నారని అనుమానం వచ్చిందేమో, సెషన్స్ కోర్ట్ వారు, మీరు ఎందుకు కార్మికులకు మరణశిక్షను విధించమని కోరుతున్నారు? అని, ప్రత్యేక ప్రాసిక్యూటర్ అనురాగ్ హూదాను అడిగారు. అప్పుడు ప్రాసిక్యుటర్, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది. విదేశీ పెట్టుబడులు తగ్గాయి. ఈ ఘటన భారత ప్రతిష్ఠకు భంగం కలిగించింది అని చెప్పారు. వీరికి కార్మికుల ప్రాణాల పట్ల ఉన్న ప్రేమ ఇది.

పారిశ్రామికాధిపతుల సెల్ఫ్ సర్టిఫికేషన్ విషయం మొదలు కొని వారికి ఎదురయ్యే ప్రతి సమస్య పట్ల నిరంతరం శ్రద్ధ చూపే బిజెపి ప్రభుత్వం వారికి అనువైన వసతులను ఏర్పరచడంలో BJP ప్రభు త్వం ఎప్పుడు ముందు ఉంటుంది. ప్రపంచ బ్యాం క్ మరియు స్వదేశి, విదేశి పారిశ్రామికాధిపతులు, గుజరాత్ నమూనా అద్భుతం అని పొగడుతుంటారు. లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ మినిస్ట్రీ వారు సమర్పించిన నివేదిక ప్రకారం, పారిశ్రామిక ప్రమాదాలకు బలయిన కార్మికుల మరణాల సంఖ్యలో గుజరాత్ కు మొదటి స్థానం వచ్చింది. 201416 మధ్య కాలంలో గుజరాత్ లో జరిగిన పారిశ్రామిక ప్రమాదాలలో 687 మంది కార్మికులు మరణించారు. 482 మంది కార్మికుల మరణాలతో మహరాష్ట్ర 2వ స్థానంలో నిలిచింది.

రసాయనిక పదార్థాల తయారి పరిశ్రమలు, మైనింగ్ లలో, యంత్రాల తయారీ పరిశ్రమల్లో, వస్తువుల తయారి పరిశ్రమలలో, విద్యుత్ పరిశ్రమ ఇలా దాదాపు అన్ని పరిశ్రమలలో ప్రమాదాలు జరుగుతుంటాయి. పరిశ్రమల యజమానులు తగిన భద్రతా ప్రమాణాలు పాటించక పోవడం, ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణ కొరవడటం, నూతన యంత్రాల వినియోగం పై శిక్షణలు లేకపోవడం, పనిభారం పెరగడం, ఎక్కువ పనిగంటల వంటివి పరిశ్రమలలో జరుగుతున్న ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. ఈ ప్రమాదాలలో పరిశ్రమలలో పని చేసే కార్మికులే కాకుండా, ఆ పరిశ్రమల చుట్టూ ఉన్న ప్రజలు కూడా మరణిస్తుంటారు. శాశ్వత వికలాంగులు అవుతుంటారు.

ప్రాణ నష్టం నష్టం తో పాటూ ఆస్తి నష్టం జరుగుతుంటుంది. పశుగణం కూడా మరణిస్తుంది. పర్యావరణానికి కూడా నష్టం జరుగుతుంది. తక్షణ నష్టాలే కాకుండా దీర్ఘ కాల నష్టాలు కూడా ఉంటాయి. పెద్ద స్థాయిలో జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలు బయటికి వస్తుంటాయి. దేశంలో రిజిస్టర్డ్ అయినవి, రిజిస్టర్డ్ కానివి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అన్నీ కలిపి సుమారు 4.5 కోట్ల పరిశ్రమలలో 10.6 కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే మొత్తం కార్మికుల్లో 40% మంది పనిచేస్తున్నారు. కోట్లలో ఉన్న పరిశ్రమల్లో రోజుకు 137 కు పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ప్రమాదాల వార్తలను పరిశ్రమల యాజమాన్యాలు బయటికి రాకుండా చేస్తుంటాయి.

పరిశ్రమలలో బయటి రాష్ట్రాల వారిని పనిలోకి తీసుకోవడం, అసలు ఎంత మంది కార్మికులు పనిచేస్తుంటారనే విషయాన్ని దాయడం, ప్రమాదం జరిగిన వెంటనే, వీలయినంతవరకు తక్కువగా చిత్రీకరించడం, ప్రమాద కారకులుగా బాధితులైన కార్మికులను చూపించి, తమది ఎటూంటి పొరపాటు లేదని చూపడానికి యజమానులు ప్రయత్నిస్తుంటారు. హైద్రబాద్ లోని పఠాన్ చెరువు లోని కొన్ని పరిశ్రమలలో పని చేయడానికి ఇతర ప్రాంతాల నుండి, ముఖ్యంగా ఆంధ్ర నుండి వచ్చే యువకులు కొంత కాలం తరువాత, తరచు రోగాల పాలవడం, ఆ తరువాత వారు దీర్ఘకాలిక రోగాల పాలయి మరణించడం జరుగుతుంటుంది.

ఈ విషాదలకు కారణాలు తెలియవు?
దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఘోరమైన పారిశ్రామిక ప్రమాదమయిన భోపాల్ విషవాయువు దుర్ఘటన జరిగి నేటికి మూడున్నర దశాబ్దాలు అవుతుంది. ఆనాడు అంటే 1984 డిసెంబర్ 3 వ తేదీ అర్ధరాత్రి సమయంలో, మధ్య ప్రదేశ్ రాష్త్రంలోని భోపాల్ పట్టణంలో, రసాయనిక పురుగు మందులను తయారు చేసే యూనియన్ కార్బెడ్ సంస్థకు చెందిన పరిశ్రమలో, మిథైల్ ఐసో సైనెడ్ లీకయి, ఆ రాత్రే సుమారు 3500 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి సంఖ్య ఆ తరువాత 20,00025,000కు పెరిగింది. ఒక లక్ష 70 వేల మంది వ్యాధుల పాలు అయ్యారు. ఆ విష పదార్థాల వ్యర్థాలు భూమిలో కలిసి పోయిన ఫలితంగా, నీటి రూపంలో, గాలి రూపంలో, తినే తిండి రూపంలో వాటిని వినియోగిస్తూ, నేటికి ప్రజలు బాధితులుగా మారుతున్నారు. దాదాపు మూడు తరాల ప్రజలను ఈ ప్రమాదం భాదితులుగా మార్చింది.

నేటికి భోపాల్ ప్రజలు దోషులను కఠినంగా శిక్షించాలని, తమకు నష్టపరిహారం చెల్లించి, న్యాయం చేయాలని పోరాడుతున్నారు. ఇంత పెద్ద స్థాయి ప్రమాదానికి ప్రధాన కారకుడయిన వారెన్ అండర్సన్‌ను ఎటువంటి శిక్ష లేకుండా తప్పించి వారి దేశానికి పంపించారు. మిగిలిన 12 మంది సంబంధిత దోషులకు కేవలం 2 సంవత్సరాల జైలు శిక్ష, లక్ష జరిమానతో సరిపుచ్చారు. ఈ కేసును సాధారణ రోడ్డు ప్రమాదాలకు విధింపచేసే భారతీయ శిక్షా సృతి 304 ఎ సెక్షన్ క్రింద నమోదు చేశారు. నిందితులు అందరూ అరెస్ట్ అయిన కొన్ని గంటలలోనె బెయిల్ పై బయటికి వచ్చారు. 1969 లో మన దేశంలో స్థాపించబడిన యూనియన్ కార్బైడ్ సంస్థకు, అమెరికా లో కుడా రసాయనిక పురుగు మందులు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. అయితే భద్రతా ప్రమాణాల విషయంలో, ప్రమాద నివారణ వ్యవస్థలో, అక్కడి పరిశ్రమలకు, మన దేశంలో స్థాపించిన పరిశ్రమకు తేడాలు ఉన్నాయి.

వర్జీనియాలో ఉన్న రసాయన పరిశ్రమలో 4 అలారంల ప్రమాద నివారణ వ్యవస్థలు ఉంటే, భోపాల్‌లో ఒకటే ఉంది. అక్కడ నాణ్యమైన స్టీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడితే, భోపాల్ లో ఖర్చు తగ్గించుకునేందుకు నాసిరకం స్టీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడారు. రక్షణ వ్యవస్థ సిబ్బందిని ప్రమాదానికి 6 నెలల క్రితం 35 శాతానికి తగ్గించారు. కార్మికుల భద్రత కొరకు, అమెరికాలో తరహా కఠినమైన చట్టాలు మన దేశంలో లేవు. ప్రమాదం తరువాత నిపుణుల బృందాలు, భోపాల్ లోని రసాయనిక పరిశ్రమలోని భద్రతా వ్యవస్థకు సంబంధించి, తీవ్రమయిన లోపాలను చాలా వాటిని వెలుగులోకితెచ్చాయి.

అత్యంత తీవ్రమయిన భోపాల్ రసాయన పరిశ్రమ ప్రమాదం తరువాత కూడా, దేశంలో, పారిశ్రామిక ప్రమాదాల నివారణకు తగిన సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదు. దేశంలో ప్రతిరోజు వందకు పైగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పారిశ్రామికాధిపతులకు అవసరమైన అనుమతులు ఇవ్వడం, వారికి మెరుగయిన, శీఘ్రమైన సేవలను అందించండమే తమ బాధ్యత అని పాలకులు భావిస్తున్న కాలం ఇది. ప్రభుత్వాధికారులు, పరిశ్రమలను సందర్శించాలంటే, ముందుగా సంబంధిత పారిశ్రామికాధిపతులకు చెప్పి వెళ్లాల్సిన పరిస్థితులను ఏర్పరిచారు. ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేసి, అందులో కార్మికులకు యూనియన్లను లేకుండా చేశారు. ఆ పరిశ్రమలలో, కార్మికులను శాశ్వత ప్రాతిపాదికన కాకుండా, తాత్కాలిక ప్రాతిపాదికన నియమించుకుంటున్నారు.

కార్మికులు పని ప్రదేశంలో, తమకు అవసరమైన కనీస భద్రత, హక్కుల గురించి కూడా అడిగేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారు. కార్మికులకు సంఘాలు ఉండటం, వారు పోరాటాలు చేయడం అభివృద్ధికి ఆటంకం అన్న ప్రచారాన్ని బలంగా చేస్తున్నారు. అనుమతులు లేకుండా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా పరిశ్రమలను నిర్వహిస్తున్నప్పటికీ, పాలకులు వాటిని చూసీచూడకుండా వదిలేస్తున్నారు. మేఘాలయలో 7 నెలల క్రితం, ఎలుక సొరంగాలు అనబడే, మైనింగ్ పరిశ్రమలో 15 మంది మైనర్ బాలురు పనిచేస్తూ సొరంగం లోతుల్లో జలసమాధి అయిన విషాదం తెలిసిందే. ఎన్నో ప్రమాదకర పరిశ్రమలు నిర్వహిస్తున్నప్పటికి వాటిని నిరోధించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

కార్మికుల పని పరిస్థితులు, భద్రతా ప్రమాణాలను సంరక్షణ కై 13 రకాల చట్టాలు ఉన్నప్పటికీ, ఆ చట్టాలు సరిగా అమలు కావడం లేదు. ఈ 13 చట్టాలను కలిపి, ఒకే ఉమ్మడి చట్టంగా తేవాలని సంకల్పించి సేఫ్టీ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ – 2019 పేరిట కొత్త బిల్లును రెండు రోజుల క్రితం, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ చర్య పారిశ్రామికాధిపతులకు లాభం చేకూర్చడానికే అని, కార్మికులకు మరింత నష్టం జరుగుతుందని కార్మిక సంఘాలు చెపుతున్నాయి. ఈ బిల్లుకు , కోడ్ ఆన్ వేజెస్ – 2019 బిల్లుకు నిరసనగా ఆగస్టు 2వ తేదీన కార్మిక సంఘాలు అన్ని కలిసి దేశ వ్యాప్త నిరసన చేపట్టాయి.ఇంటర్ నేషనల్ లేబర్ ఆర్గనిజేషన్ (ILO) 2017 లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ప్రపంచంలో ఏటా 20 లక్ష ల 30 వేల మంది కార్మికులు పారిశ్రామిక ప్రమాదాలలో మరణిస్తున్నారు. అందులో మన దేశ కార్మికుల శాతం 2% పైగా ఉంది.

ప్రభుత్వం, పా రిశ్రామికాధిపతుల నియంత్రణలోకి వెళ్లేకొద్దీ పారిశ్రామిక విధానాల రూపకల్పనలో పారిశ్రామికాధిపతుల లాభాల పెంపుదల తప్ప మరో దానిపై శ్రద్ధ పెట్టని పరిస్థితి ఏర్పడుతుంది. పని పరిస్థితులలో భద్రతా ప్రమాణాలను ఏర్పరచడం, వాటిని స్థిరంగా కొనసాగించడం, పారిశ్రామిక ప్రమాదా ల నివారణకు సంబంధించిన అన్ని వ్యవస్థలను తగినంత స్థాయిలో నెలకొల్పి కొనసాగించడం లా ంటి విషయాల్లో నిర్లక్ష్యం పెరుగుతుంది. ప్రమాద నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏవిధంగా అమలు చేస్తున్నారు? ఇంకా ఎలాంటి భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలి? అన్న వాటిని కార్మిక సంఘాలతో సంప్రదించాలి. పరిశ్రమల్లో 24 గంటలు పని చేస్తున్నది వారు కాబట్టి, వారికి భద్రతా పరిస్థితుల గురించి ఎక్కువ తెలిసేందుకు అవకాశం ఉం టుంది. కార్మికులను, సంబంధిత నిపుణులను భద్రతా ప్రమాణాలు నెలకొల్పడం, నిర్వహణలో భాగస్వాము ల్ని చేయకుం డా తీసుకునే చర్యలు నామమాత్రంగానే ఉంటాయి. ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కార్మికులు బలవుతూనే ఉంటారు.

Every year 48,000 workers death in Industrial Accidents

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సంపద సృష్టిలో సమిధలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.