ప్రతి మహిళా సెలబ్రిటీనే!

  ఒకప్పుడు మహిళలు ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ తనను తాను పట్టించుకునేది కాదు. కుటుంబంలోని ప్రతిఒక్కరినీ కంటికి రెప్పలా చూసుకునేవారు. ఈ నేపథ్యంలో ఆమె తన అస్తిత్వాన్ని కోల్పోయిందనే చెప్పొచ్చు. కాలక్రమంలో ఇప్పుడిప్పుడే తన గురించి కూడా పట్టించుకుంటోంది. ఆమె కూడా ఓ సెలబ్రిటీగా మారుతోంది. మిసెస్ ఇండియా తదితర పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదగడం సంతోషించదగ్గ విషయం. కట్టు బొట్టు విషయంలో ఆధునికతను సంతరించు కుంటూనే సౌకర్యాన్ని వెతుక్కుంటోంది. అలంకరణ, వేషధారణ అనేవి వయస్సుకు […] The post ప్రతి మహిళా సెలబ్రిటీనే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఒకప్పుడు మహిళలు ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ తనను తాను పట్టించుకునేది కాదు. కుటుంబంలోని ప్రతిఒక్కరినీ కంటికి రెప్పలా చూసుకునేవారు. ఈ నేపథ్యంలో ఆమె తన అస్తిత్వాన్ని కోల్పోయిందనే చెప్పొచ్చు. కాలక్రమంలో ఇప్పుడిప్పుడే తన గురించి కూడా పట్టించుకుంటోంది. ఆమె కూడా ఓ సెలబ్రిటీగా మారుతోంది. మిసెస్ ఇండియా తదితర పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదగడం సంతోషించదగ్గ విషయం. కట్టు బొట్టు విషయంలో ఆధునికతను సంతరించు కుంటూనే సౌకర్యాన్ని వెతుక్కుంటోంది.

అలంకరణ, వేషధారణ అనేవి వయస్సుకు సంబంధించినవి కావు. మహిళల ఇష్టానికి సంబంధించినవి. అన్ని వయస్సుల్లోనూ తనను తాను మెయిన్‌టెయిన్ చేసుకోగలిగే సమయాన్ని సమకూర్చుకుంటోంది నేటి మహిళ. వయసు మీద పడినా సరే దాన్నీ ఆస్వాదిస్తూ పోషకాహారాన్ని తీసుకుంటూ ఫిట్‌నెస్‌తో ఉంటోంది ఆధునిక మహిళ.

చర్మాన్ని పట్టించుకోండి: అన్నింటికంటే ముందు ఎదుటివారిని ఆకట్టుకునేది ముఖమే. ఉద్యోగాలు చేసే వారు తమ చర్మసంరక్షణ పట్ల కొంత శ్రద్ధ తీసుకుంటారు. కానీ కొంతమంది గృహిణులు మాత్రం ఇంట్లోనే ఉంటాం కదా మాకెందుకివన్నీ అనుకుంటారు. ఇలాంటి ఆలోచన తప్పు. ఇంటి పనులు సహజం. వంట చేయడం లాంటి పనులతో సతమతం అవుతుంటారు. చర్మ సంరక్షణ వీరికీ అవసరమే. నెలకోసారి స్కిన్ ట్రీట్‌మెంట్ అవసరం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఇంట్లో దొరికే శనగపిండి, కీరాలాంటి వాటితో చర్మాన్ని కాపాడుకోమంటున్నారు.

మంచి డైట్‌తో ఆరోగ్యం: పెళ్లికి ముందు ప్రతి ఒక్క యువతీ తనపై శ్రద్ధ తీసుకుంటుంది. పెళ్లయ్యాకనే తనపై అశ్రద్ధ మొదలవుతుంది. సాధారణంగా ప్రతి ఐదేళ్లకు హార్మోన్లలో మార్పులు జరుగుతూ ఉండటం సహజం. అందుకనే ఎప్పటికప్పుడు తమ డైట్‌ను మార్చుకుంటూ ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలని నూట్రీషియన్లు సూచిస్తున్నారు. రోజులో కనీసం 10, 12 గ్లాసుల మంచినీళ్లు తాగాలి. కచ్చితంగా ఉదయాన్నే అల్పాహారాన్ని తీసుకోవాలి. ఇలా కచ్చితమైన డైట్ పాటిస్తుంటే అందం ఆరోగ్యం ఆమెసొంతం అవడం ఖాయం.

తనకంటూ ఓ వ్యక్తిత్వం: తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికే మొగ్గు చూపుతోంది నేటి వనిత. పలానా వారి భార్య అనిపించు కోవడానికి ఇష్టపడటం లేదు. అందుకనే తనకిష్టమైన రంగంలో కృషి చేస్తూ పదిమందికీ ఉపయోగపడే పనిచేస్తోంది. ఇలా చాలా మంది మహిళలు వ్యాపారరంగంలో రాణిస్తున్నారు.

డ్రెస్సింగ్ సెన్స్ చాలా ముఖ్యం: ఇతరులు వేసుకుంటున్నారని కాకుండా తమకు ఏమి నప్పుతుందో తెలుసుకోవాలి.ఎలాంటి దుస్తులు వేసుకున్నా కూడా హుందాగా ఉండాలం టున్నారు డైజనర్లు.
ఈ విషయంలో కొంతమంది సెలబ్రిటీలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

 

ఒత్తిడిని వదిలేయాలి

యాభై ఏళ్లుదాటినా కూడా ఇప్పటికీ చెరగని అందం మాధురీ దీక్షిత్‌ది. ఖరీదైన కాస్మోటిక్స్‌కి బదులుగా ఇంటి చిట్కాలను వాడటమే ఈమె అందం రహస్యం. ప్రతి మహిళా తనను తాను పట్టించుకోవడం తప్పనిసరి అని చెబుతుంటారీమె.
మంచి ఆహారం, ఫిట్‌నెస్ ఇనవ్నీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఒత్తిడి లేని జీవితమే అందం అంటారీమె.

గ్లామర్ నటిగా…

హేమమాలినికి 65 ఏళ్లు పైబడినా సరే ఇప్పటికీ అదే గ్లామర్‌ను కాపాడుకుంటోంది. నేటికీ గ్లామరస్ నటిగా ఉంది. ఎప్పటికీ ఆమె ఎంతోమందికి డ్రీమ్ గర్ల్. ఆమె సహజంగా నృత్యకళాకారిణి. ఇది కూడా ఆమెకు ప్లస్ అయింది. అత్యంత తక్కువ మేకప్ వేసుకునే నటి కూడా. సహజ అందం ఆమెది. సంప్రదాయ సౌందర్య చిట్కాలను పాటిస్తుంది. చర్మం సంరక్షణ కోసం ఎక్కువగా పండ్లు, కూరగాయలను డైట్‌లో ఎక్కువగా తీసుకుంటుంది. క్రమశిక్షణగల జీవితాన్ని ఆస్వాదిస్తూ నటిగా, ఎంపీగా, నృత్యకళాకారిణిగా రాణిస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

నడక కొత్త ఉత్సాహాన్నిస్తుంది

చక్కని చిరునవ్వుతో ఆకట్టుకునే అందం జూహీచావ్లాది. హుషారైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన అద్భుత నటి. యాభై ఏళ్ల లోనూ అదే అందాన్ని మెయిన్‌టెయిన్ చేస్తోందీమె. ప్రతి మహిళా ఇంట్లో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా తన పట్ల ప్రేమను పెంచుకోవాలి. ఫిట్‌నెస్‌ను ఎప్పుడూ కోల్పోకూడదు. దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన చర్మం తాజాగా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలంటోంది జూహీ. రాత్రిపూట మేకప్ తీసేసి పడుకోవాలని సలహా ఇస్తోంది. ఉదయాన్నే వాకింగ్ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అంటోంది.

Every woman is a celebrity

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రతి మహిళా సెలబ్రిటీనే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: