థ్రిల్లింగ్ అంశాలతో ‘ఎవరు’

  వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో అడివి శేష్, రెజీనా కాసాండ్రా హీరోహీరోయిన్‌లుగా రూపొందుతున్న థ్రిల్లర్ మూవీ ‘ఎవరు’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ “దర్శకుడు వెంకట్ రామ్‌జీ చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే నేను ఈ సినిమా చేస్తానని చెప్పాను. ఈ సినిమాలో నేను సమీరా అనే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు వెంకట్ రామ్‌జీ నన్ను దృష్టిలో పెట్టుకునే ఆ […] The post థ్రిల్లింగ్ అంశాలతో ‘ఎవరు’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో అడివి శేష్, రెజీనా కాసాండ్రా హీరోహీరోయిన్‌లుగా రూపొందుతున్న థ్రిల్లర్ మూవీ ‘ఎవరు’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ “దర్శకుడు వెంకట్ రామ్‌జీ చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే నేను ఈ సినిమా చేస్తానని చెప్పాను. ఈ సినిమాలో నేను సమీరా అనే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు వెంకట్ రామ్‌జీ నన్ను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్ర రాశాను అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది.

కథ విషయానికొస్తే… సమీరా జీవితంలో ఓ సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏంటి?… ఆ సంఘటనపై ఎలాంటి విచారణ జరిగింది? చివరికీ ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? లాంటి థ్రిల్లింగ్ అంశాలు సినిమాలో బాగా ఆకట్టుకుంటాయి. అడివి శేష్ మంచి నటుడు. తనతో కలిసి పనిచేసినందుకు ఆనందంగా ఉంది. ఇక ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ చర్చల దశలో ఉన్నాయి. అలాగే హిందీలో కూడా త్వరలో ఓ సినిమా ఫైనల్‌కానుంది”అని అన్నారు.

Evaru movie with thrilling elements

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post థ్రిల్లింగ్ అంశాలతో ‘ఎవరు’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: