అమరుల త్యాగఫలమే రాష్ట్ర ఆవిర్భావం: మంత్రి ఈటెల

అనతి కాలంలో అద్భుత విజయాలు మన పథకాలకు దేశవిదేశాల ప్రశంసలు దేశానికే ఆదర్శంగా మన రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్షం గ్రామాలకు చెరువులు జీవనాధారం నేరాల నియంత్రణలో దేశవ్యాప్తంగా 4వ స్థానం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అమరవీరుల త్యాగఫలమే అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి […] The post అమరుల త్యాగఫలమే రాష్ట్ర ఆవిర్భావం: మంత్రి ఈటెల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అనతి కాలంలో అద్భుత విజయాలు
మన పథకాలకు దేశవిదేశాల ప్రశంసలు
దేశానికే ఆదర్శంగా మన రాష్ట్రం
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం
రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్షం
గ్రామాలకు చెరువులు జీవనాధారం
నేరాల నియంత్రణలో దేశవ్యాప్తంగా 4వ స్థానం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అమరవీరుల త్యాగఫలమే అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరించి నేటికి 5 వసంతాలు గడిచిందని, ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిచ్చాయన్నారు. అనతికాలంలోనే మన రాష్ట్రం అద్భుత విజయాలు సాధించిందని తెలిపారు. సంక్షేమ పథకాలకు దేశవిదేశాల నుండి ప్రశంసలు అందుతున్నాయని, ఇది సిఎం కెసిఆర్ ఘనతే అని అన్నారు. దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని ఎన్నో వినూత్న, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి, అమలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణ, గోదావరి జలాల్లో 1,330 టిఎంసిల నీటి వాటా ఉందని అందుకు ప్రాజెక్టుల నిర్మాణం మాత్రం జరుగలేదని, ఆ వాటాను సమర్థవంతంగా వినియోగించుకొని రాష్ట్రంలో కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే లక్షంతో ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ తదితర నీటి ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమయి రూపురేఖలు మారుతాయన్నారు. రైతు దేశానికే వెన్నుముక అని, ప్రజలు ఆకలి తీర్చే అన్నదాత రైతు అని, రైతును రాజు చేయడమే లక్షంగా ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. సాగురైతులకు పెట్టుబడి సాయం క్రింద ఎకరాకు 8 వేల నుండి 10 వేలకు పెంచి అందిచడం జరుగుతుందన్నారు. జిల్లాలో 231.46 కోట్లు అందించడం జరిగిందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు కావాల్సిన విత్తనాలు కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతు కుటుంబాలకు 5 లక్షల రైతుబంధు జీవిత బీమా పథకం ప్రవేశపెట్టి, చనిపోయిన రైతు కుటుంబానికి పది రోజుల్లోనే చెక్కును అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన రైతులందరికీ జీవిత బీమా బాండ్ల పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 255 మంది రైతులు మరణించగా 243 మంది రైతులకు 5 లక్షల చొప్పున నామినీ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 28.50 కోట్లతో 47,500 మెట్రిక్ టన్నుల సామర్థం గల గోదాంలను నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. అధిక దిగుబడులు వచ్చే బిందు, తుంపర్ల సేధ్యానికి రైతులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 1,60,002 కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని మంత్రి వివరించారు.

జిల్లాలో 94,762 వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, ప్రతి యేడాది 91.66 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం బరిస్తుందన్నారు. చెరువులను పునరుద్ధరించి గ్రామాలను సస్యశ్యామంల చేయాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 4 దశల్లో 318 కోట్ల 958 చెరువుల పనులను మంజూరు చేశామన్నారు. మిగిలిన చెరువుల పనులన్నీ ప్రగతిలో ఉన్నాయని, జిల్లాలో మొత్తం 12 చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, వాటి ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. త్రాగునీటికై మహిళలు పడుతున్న దుస్థితిని దూరం చేయడానికి ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి త్రాగునీరు అందిస్తోందని తెలిపారు. తెలంగాణకు హరితహారం పథకం ద్వారా జిల్లాలో 2.35 కోట్ల మొక్కలు నాటడానికి లక్షంగా నిర్ణయించామన్నారు. అంధత్వరహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం కంటివెలుగు పథకాన్ని ప్రవేశపెట్టి ఇప్పటి వరకు 5,49,029 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి అద్దాలు చేసి, ఉచిత నేత్ర శస్త్ర చికిత్సల కోసం ఉన్నత స్థాయి ఆసుపత్రులకు పంపించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలను కార్పొరేట్ వైద్యశాలగా అభివృద్ధి చేసి పేదలకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్నామన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 16,231 కేసీఆర్ కిట్లను కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవించిన ఆడపిల్లల తల్లులకు 13 వేలు, మగబిడ్డ తల్లులకు 12 వేల చొప్పున నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 2,59,320 కుటుంబాలకు ఆహారభద్రత కార్డులను మంజూరు చేశామని, 15,944 కుటుంబాలకు అంత్యోదయ కార్డులు మంజూరు చేసి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సొంత ఇంటి కలను సాకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పథకం ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో జిల్లాకు 6,454 ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఆడపిల్లల వివాహాలకు, పేద ప్రజలు అప్పులపాలు కాకుండా కాపాడటానికి ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ, షాదీముబారఖ్ పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఆరోగ్యలక్ష్మీ పథకం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు ప్రతిరోజూ కోడిగుడ్లు, పాలు, పౌష్టికాహారంతో కూడిన ఒకపూట భోజనం అందిస్తున్నామన్నారు. మత్సకారుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, చేపల పెంపకానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిని ప్రభుత్వమే బరించి లాభాలను మాత్రం బెస్త, ముదిరాజ్ తదితర మత్సకారులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఆసరా ఫింఛన్ల పథకం ద్వారా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఫింఛన్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. జూన్ నెల నుండి దివ్యాంగులకు 3016 రూపాయలను, ఇతర కేటగిరీ వారికి 2016 రూపాయలను చెల్లించడం జరుగుతుందన్నారు. జిల్లాలో సింగిల్ లైన్ రోడ్లను డబుల్ రోడ్లుగా, డబుల్ రోడ్లను ఫోర్ లైన్ రోడ్లుగా అభివృద్ధి చేయుట, లింక్ రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం జిల్లాకు 148.30 కోట్లు మంజూరు చేసిందన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా జిల్లాలో 2,213 రోడ్డు పనులు, కొత్త తారురోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, సిసి రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 247.66 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కరీంనగర్ నగరాన్ని అందమైన సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, అందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కరీంనగర్ పోలీస్ సమర్థవంతంగా పనిచేస్తోందని కొనియాడారు. కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో సుమారు 5 వేలకు పైగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ప్రజల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యల ద్వారా కరీంనగర్ కమీషనరేట్ దేశవ్యాప్తంగా 4వ స్థానంలో నిలవడం జిల్లాకు గర్వకారణమన్నారు. ఈ వేడుకల్లో కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ సయ్యద్ అక్బద్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ప్రత్యేక అధికారిణి ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్యాప్రసాద్ లాల్, నగర మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, డిఆర్వో భిక్షానాయక్‌లతో వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Etela Speech at Telangana Formation Day Celebrations

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమరుల త్యాగఫలమే రాష్ట్ర ఆవిర్భావం: మంత్రి ఈటెల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.