పేదలకు మెరుగైన వైద్యసేవలు…

 Medical Services

 

హైదరాబాద్ ఆస్పత్రులకు దీటుగా ఎంజిఎం
మూడునెలల్లో అత్యాధునిక సేవలు అందిస్తాం
గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే వైద్యులకు బదిలీలలో ప్రాధాన్యత
ఎంజిఎం ఆస్పత్రిని తనిఖీ చేసిన మంత్రులు ఈటల, ఎర్రబెల్లి

ఎంజిఎం : పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని, ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత, నితర సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీరు సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఎంజిఎం ఆస్పత్రిని, కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి నిర్మిస్తున్న నూతన భవనం పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసిసందర్శించి తనిఖీ చేశారు.

అనంతరం కాకతీయ మెడికల్ కళాశాల యందు అధికారులతో వివిధ అంశాల గురించి కెఎంసి, కళాశాలలోని ఎగ్జామినేషన్ హాల్‌లో అధికారుల వివిధ అంశాలతో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరై మాట్లాడుతూ వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని, అంతరాత్మప్రభోధం ప్రకారం విధులు నిర్వర్తించాలని, వైద్య ఆరోగ్యశాఖ, ఉద్యోగులకు సూచించారు. ఎంజిఎంలోని సమస్యలపై ఆరాతీసి స్కానింగ్ సెంటర్లపై, సిబ్బంది కొరతపై, వైద్య పరికరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎంజిఎం ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని అన్నారు.

ఎంజిఎం ఆస్పత్రిని హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఎంజిఎం ఆస్పత్రిని తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్య సేవలు కల్పిస్తామన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అత్యవసర పరిస్థితులలో ఎంజిఎం ఆస్పత్రిని నుండి హైదరాబాద్‌కు వెళ్లకుండా అన్నిరకాల వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతామని ఆస్పత్రిని టిప్‌టాప్ చేసి మూడు నెలల కాలంలో ఎంజిఎం ఆస్పత్రిలో సుపరిపాలన అందిస్తామన్నారు. కెఎంసి కళాశాల ప్రిన్సిపాల్ నుండి సమస్యలను తెలుసుకొని కెఎంసి అభివృద్ధ్దికి కృషి చేస్తామన్నారు.

వరంగల్ తూర్పు ఎంఎల్‌ఎ నరేందర్ మాట్లాడుతూ ఎంజిఎంలో సిబ్బంది కొరతగా ఎక్కువగా ఉందని, ఔట్‌సోర్సింగ్ సమస్యలను పరిష్కరించి తగిన విధంగా సిబ్బందిని నియమించాలని కోరారు. నగర మేయర్ గుండా ప్రకాష్‌రావు, పార్లమెంట సభ్యుడు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య, వి.సతీష్‌కుమార్, జడ్పి చైర్మన్ సుధీర్‌కుమార్, అన్ని విభాగాల వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Etela said better Medical Services Provided to Poor

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పేదలకు మెరుగైన వైద్యసేవలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.