పూర్తిగా కరోనా చికిత్సకే గాంధీ

అధికారులకు మంత్రి ఈటల ఆదేశం మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా బాధితుల చికిత్స కొరకు వినియోగించాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోన వైరస్ వ్యాప్తి మూడవ దశకి చేరుకుంటే తీసుకోవాల్సిన జాగ్రతలపై ఆయన గురువారం వైద్యాధికారులతో సమీక్ష సమావేవం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విదేశాల నుండి వచ్చిన వారిని,వారితో కలిసిన ఇతరులను పూర్తి స్థాయిలో పరిశీలనలో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. హాస్పిటల్స్‌లో పనిచేసే వైద్య సిబ్బంది […] The post పూర్తిగా కరోనా చికిత్సకే గాంధీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అధికారులకు మంత్రి ఈటల ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా బాధితుల చికిత్స కొరకు వినియోగించాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోన వైరస్ వ్యాప్తి మూడవ దశకి చేరుకుంటే తీసుకోవాల్సిన జాగ్రతలపై ఆయన గురువారం వైద్యాధికారులతో సమీక్ష సమావేవం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విదేశాల నుండి వచ్చిన వారిని,వారితో కలిసిన ఇతరులను పూర్తి స్థాయిలో పరిశీలనలో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. హాస్పిటల్స్‌లో పనిచేసే వైద్య సిబ్బంది కి ఎట్టి పరిస్థితుల్లో సెలవులు ఇవ్వొద్దని , చికిత్సకు కావాల్సిన అన్ని పరికరాలను సమీకరించుకోవాలన్నారు. విదేశాల నుండి వచ్చే వారిని స్క్రీన్ చేయడం, హోమ్ క్వారంటైన్ ఉన్నవారికి పరీక్షలు చేయడం లాంటి కార్యక్రమాలతో పాటు సిఎం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉపయోగపడతాయన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి రెండవ దశలోకి చేరుకుందని, గురువారం మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో 44 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, ఇప్పటికే ఒక్కరికి పూర్తిగా నయం చేసి డిశ్చార్జ్ చేశామన్నారు. మిగిలిన వారందరూ కొలుకుంటున్నారని, ఎవరికి ప్రాణాపాయ స్థితి లేదని మంత్రి తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్లు ఉండటం బాధకరమని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా గమనించాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని మంత్రి కోరారు. సర్వేలెన్స్ పెంచడం ద్వారానే దీనిని అరికట్టగలమని ఆ టీమ్స్ ని పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది, ఆశ వర్కర్లు, ఇతర సిబ్బందిలకు పూర్తిగా సెలవులు రద్దు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

అవసరం ఉన్న చోట్ల సిబ్బందికి భోజనం, రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు ను మంత్రి ఆదేశించారు. విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరి డాటా ఉండాలన్నారు. వ్యాధి వ్యాప్తి తీవ్రత పెరిగితే అవసరమయ్యే హాస్పిటల్స్, సిబ్బంది, వైద్య పరికారాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరామని మంత్రి తెలిపారు. ఇప్పటికే గాంధీ లో చేయాల్సిన ఆపరేషన్లు ఉస్మానియా ఆసుపత్రిలో చేస్తున్నారని, ఈ నెలాఖరు వరకు మిగతా అన్నీ విభాగాలను కూడా తరలించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డిని మంత్రి కోరారు. దీంతో పాటు కింగ్ కోఠి ఆసుపత్రిని కూడా కరోనా చికిత్స కోసం సిద్ధంగా ఉంచాలన్నారు.

వీటితో పాటు అవసరం అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్ ల సేవలు వినియోగించుకొనేందుకు కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి ఆద్వర్యంలో కమిటీ పనిచేస్తుందని తెలియజేశారు. పేషంట్ల సంఖ్య పెరిగితే ముందుగా అవసరం అయ్యేది పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ కావున వాటిని సాధ్యమైనన్ని ఎక్కువ కొని పెట్టుకోవాలని టిఎస్‌ఎమ్‌ఐడిసి ఎండి చంద్ర శేఖర్ రెడ్డి ని మంత్రి ఆదేశించారు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పనిచేస్తున్న కమిటీలు తక్కువ ధరకు నాణ్యమన పరికరాలు కొనుగోలు చేసేందుకు కృషి చేయాలని మంత్రి తెలిపారు. ప్రజలు కూడా షట్ డౌన్ ని పాటించాలని, పక్కన వారిని కలవకుండా ఉండడమే మనకు శ్రీరామరక్షని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Etela Rajender held review meeting with doctors

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పూర్తిగా కరోనా చికిత్సకే గాంధీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: