రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన

  హైదరాబాద్ : తెలంగాణలో పెద్దఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లును నెలకొల్పేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి  కెసిఆర్ తెలిపారు. సిఎం కెసిఆర్‌ను శనివారం ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పూరి, సభ్యులు కలిశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ వద్ద రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐటీసీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పూర్తైంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పూర్తయినట్లు సిఎంకు ఐటీసీ ఛైర్మన్ తెలిపారు. వేగంగా నిర్మాణం పూర్తి చేసినందుకు ఐటీసీ ఛైర్మన్‌ను సిఎం […] The post రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : తెలంగాణలో పెద్దఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లును నెలకొల్పేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి  కెసిఆర్ తెలిపారు. సిఎం కెసిఆర్‌ను శనివారం ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పూరి, సభ్యులు కలిశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ వద్ద రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐటీసీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పూర్తైంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పూర్తయినట్లు సిఎంకు ఐటీసీ ఛైర్మన్ తెలిపారు.

వేగంగా నిర్మాణం పూర్తి చేసినందుకు ఐటీసీ ఛైర్మన్‌ను సిఎం అభినందించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన, కల్తీలేని ఆహార పదార్థాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మహిళా సంఘాలున్నాయని.. ముడి సరుకు సేకరణ, ఇతరత్రా అంశాల్లో మహిళా సంఘాల సేవలు వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో దాదాపు 500 టీఎంసీల సామర్థ్యం గల జలాశయాలు సిద్ధమవుతున్నాయి. జలాశయాల చుట్టూ పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చెందుతాయి. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలోనూ ఐటీసీ కలిసి రావాలని సిఎం పేర్కొన్నారు.

Establishment of Food Processing Units in the State

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: