తెలంగాణకు ఐఐఎం, ఐఐఎస్‌ఇఆర్

 IIM and IISCR in Telangana

 

పరిశీలనలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞపి
లోక్‌సభలో కేంద్ర మంత్రి పొఖ్రియాల్ ప్రకటన

న్యూఢిల్లీ: తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఇఆర్) నెలకొల్పేందుకు ఆ రాష్ట్రం నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి (హెచ్‌ఆర్‌డి) రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ సోమవారం లోక్‌సభలో చెప్పారు. ఆ రెండు సంస్థల ఏర్పాటు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మెమొరాండం సమర్పించారా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయని, అవి కేంద్రం పరిశీలనలో ఉన్నాయని చెప్పారు.

Establish IIM and IISCR in Telangana

The post తెలంగాణకు ఐఐఎం, ఐఐఎస్‌ఇఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.