మాకెప్పుడు స్వాతంత్ర్యం?

Independence Day

 

ఆగస్టు 15 దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజునే సంబరాలు చేసుకుంటుంటాం. నిజానికి మనందరికీ స్వాతంత్య్రం వచ్చిందా?ఇప్పటికీ స్త్రీని బానిసగానే చూస్తున్న సమాజం మనది. తెల్లవాళ్ల సంకెళ్లనైతే తెంచుకున్నాం కానీ ఇంకా ఆ దురహంకార ధోరణి నుంచి బయటపడలేకపోతున్నాం. స్త్రీని సమానంగా చూడటానికి అంగీకరించని పురుష సమాజం స్త్రీకి 33 శాతం రిజర్వేషన్లను సైతం ఇవ్వనివ్వని మనస్తత్వం నుంచి మారని పురుషాహంకారం బలంగా వేళ్లూనుకుంది. స్వాతంత్య్రమంటే పురుషులకేనా? స్త్రీలకు లేవా? వాళ్లు తలుచుకుంటే ఎన్ని బిల్లులైనా చట్టసభల్లో పాస్ చేసుకుంటారు. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని తేవాలని మాత్రం పురుషపుంగవులు తలుచుకోరు.

ఆకాశంలో సగం అంటారు.. అవకాశాల్లో ముందుంటారు.. చట్ట సభల్లో మాత్రం వద్దంటారు. ఇది మారితే తప్పా నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు కాదు. అర్ధరాత్రి నడిరోడ్డు మీద స్త్రీ ఒంటరిగా నడిచి వెళ్లినప్పుడే ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ అన్నారు. పట్టపగలు కూడా ఒంటరి మహిళ హాయిగా నడిచే రోజులు కావివి. స్వాతంత్య్రమంటే అందరిదీ. లేకుంటే అది అర్ధ స్వాతంత్య్రమే. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు కూడా స్వేచ్ఛగా చెప్పుకోగలిగిన రోజు రావాలని ఆశిద్దాం.

తిరంగ ఆర్ట్….

స్వాత్రంత్య దినోత్సవం నాడు అలంకరణ కూడా అవే రంగులు ఉండాలని యువత కోరుకుంటుంది. ఆహార్యంలోనూ దేశభక్తి కనిపించేలా శ్రద్ధ తీసుకుంటారు. ఇప్పుడు నెయిల్ ఆర్ట్ కూడా అందులో చేరింది. గోళ్లపై జెండా రంగులను అద్భుతంగా వేసుకుంటున్నారు అమ్మాయిలు. అందమంటే ఇదేనని దేన్నీ పరిగణించలేం. చూపుని ఆకట్టుకునే ప్రతీదీ అందమే. మనసు మాయచేసే ప్రతీదీ సోయగమే. అలాంటి అందాల సోయగాలను బంధించాలనే ఉబలాటం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆడవారికి మాత్రం ఆ అందాన్ని అలంకరణగా చేసుకుని.. మరింత అందంగా నలుగురికీ కనిపించాలనే ఆరాటం ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ నెయిల్ ఆర్ట్. వావ్ అనిపిస్తుంది కదూ.. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించి చూడండి.

ముందుగా నెయిల్స్ క్లీన్ చేసుకుని.. షేప్ చేసుకోవాలి. తర్వాత అన్ని నెయిల్స్‌కి ట్రాన్స్‌పరెంట్ కలర్ వేసుకుని ఆరిన తర్వాత…ఉంగరపు వేలు గోరుకి పింక్ కలర్.. చూపుడు వేలు, మధ్య వేలు గోర్లకు వైట్ కలర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూపుడు వేలు గోరుపైన బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్‌తో సన్నని బ్రష్ ఉపయోగించి.. సీతాకోకచిలుకలను చిత్రంలో ఉన్న విధంగా డిజైన్ చేసుకుని.. ఎల్లో కలర్, రెడ్ కలర్ నెయిల్ పాలిష్‌లతో.. చిత్రంలో ఉన్న విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మధ్యవేలు గోరైన కూడా.. నారింజ, తెలుపు ట్రాన్స్‌పరెంట్ రంగు, ఆకుపచ్చ రంగులను ఉపయోగిస్తూ చిత్రంలో కనిపిస్తున్న డిజైన్ వేసుకోవాలి.

Essay on Women Reservations on Independence Day

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మాకెప్పుడు స్వాతంత్ర్యం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.