పలుగు పట్టిన మంత్రి ఎర్రబెల్లి…

  వరంగల్ : ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచాయతీరాజ్‌శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామ చెరువులో ఉపాధి హామీ కూలీపనులు చేస్తున్న కూలీలతో కలిసి పలుగు పార పట్టి కొంతసేపు కూలీగా మారిపోయారు. మంత్రి దయాకర్‌రావు నిత్యం ప్రజల మధ్యనే గడిపే అలవాటు ఉండడంతో సోమవారం మధ్యాహ్నం చేసిన కూలీ పని అక్కడి కూలీలను ఎంతగానో ఉత్సాహపరిచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూలీలతో మాటా ముచ్చట మాట్లాడడానికి వచ్చిన […] The post పలుగు పట్టిన మంత్రి ఎర్రబెల్లి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్ : ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచాయతీరాజ్‌శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామ చెరువులో ఉపాధి హామీ కూలీపనులు చేస్తున్న కూలీలతో కలిసి పలుగు పార పట్టి కొంతసేపు కూలీగా మారిపోయారు. మంత్రి దయాకర్‌రావు నిత్యం ప్రజల మధ్యనే గడిపే అలవాటు ఉండడంతో సోమవారం మధ్యాహ్నం చేసిన కూలీ పని అక్కడి కూలీలను ఎంతగానో ఉత్సాహపరిచింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కూలీలతో మాటా ముచ్చట మాట్లాడడానికి వచ్చిన మంత్రి వారు చేస్తున్న పనుల్లో నిమగ్నమైపోయారు. కూలీలతో పాటు నేను సైతం అంటూ పలుగు పార పట్టి చెరువు మట్టి పనుల తీతకు పూనుకున్నారు. దాంతో కూలీలు ఒక్కసారిగా నివ్వెరపోయారు. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధనిక, పేద, కూలీ, రైతు తేడా లేకుండా అందరితో కలిసిపోయేతత్వం ఉండి నిత్యం ప్రజల మధ్య ఉండడం ఉపాధి కూలీలకు ఉత్సాహాన్ని ఇచ్చినట్లయింది.

ఈసందర్భంగా మంత్రితో ఉపాధి కూలీలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అదే సందర్భంగా మంత్రి కూడా కూలీలతో మాట్లాడి ఉపాధి హామీ పనితీరు వారికి గిట్టుబాటు అవుతున్న రోజువారి వేతనం ఇతర సౌకర్యాలు వాటిపై కూలంకుషంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో ఉపాధి హామీ కూలీలకు వెళుతున్న రైతు కూలీలందరికి అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రత  ఎక్కువ కాకముందే కూలీ పనులు ముగించి ఎండ తీవ్రత తగ్గిన తరువాత పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి వరంగల్ రూరల్ జిల్లాతో పాటు జనగాం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు.

 

Errabelli with Employment Guarantee Workers

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పలుగు పట్టిన మంత్రి ఎర్రబెల్లి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: