ప్రజల్లో కరోనాపై చైతన్యం తేవాలి: మంత్రి ఎర్రబెల్లి

– వైద్యులు సామాజిక బాధ్యతగా ప్రజలకు అందుబాటులో ఉండాలి -కరోనా వైరస్‌పై ముందు జాగ్రత్తగా రెడీ చేసిన హైసోలేషన్ వార్డు -ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించి సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి ఎంజిఎం: ప్రజల్లో కరోనా వైరస్‌పై చైతన్యం తెచ్చి అవగాహన కలిపించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులు, వైద్యులను ఆదేశించారు. వరంగల్ ఎంజిఎం ఆసుత్రిని బుధవారం సందర్శించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆసుపత్రిలోని పారిశుద్ధ్యంపై ప్రత్యేక […] The post ప్రజల్లో కరోనాపై చైతన్యం తేవాలి: మంత్రి ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

– వైద్యులు సామాజిక బాధ్యతగా ప్రజలకు అందుబాటులో ఉండాలి
-కరోనా వైరస్‌పై ముందు జాగ్రత్తగా రెడీ చేసిన హైసోలేషన్ వార్డు
-ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించి సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి

ఎంజిఎం: ప్రజల్లో కరోనా వైరస్‌పై చైతన్యం తెచ్చి అవగాహన కలిపించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులు, వైద్యులను ఆదేశించారు. వరంగల్ ఎంజిఎం ఆసుత్రిని బుధవారం సందర్శించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆసుపత్రిలోని పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పచ్చదనం, పరిశుభ్రతను పాటించాలని, వైద్యులు, సామాజిక బాధ్యతగా 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో కరోనాపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.

ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని చెప్పారు. ఎంజిఎం నిర్వహణ మరింత మెరుగుపడాలని, పారిశుద్ధ్య కాంట్రాక్టుని వెంటనే రద్దు చేయాలని తెలిపారు. కరోనా సమస్య సమిసిపోయే వరకు ఆసుపత్రి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. కరోనా వైరస్‌పై ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని హైసోలేషన్ వార్డును రెడీ చేయించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాశ్‌రావు, వరంగల్ తూర్పు ఎంఎల్‌ఎ నరేందర్, వర్ధన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, నగర కమిషనర్ పమేలా సత్పతి, ఎంజిఎం ఆస్పత్రి సూపరింటెండెంట్, డిఎంహెచ్‌ఒ తదితరులు పాల్గొన్నారు.

Errabelli Dayakar Rao Press Meet on coronavirus

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రజల్లో కరోనాపై చైతన్యం తేవాలి: మంత్రి ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: