మార్కెట్‌కు సంకీర్ణ భయం

  వరుసగా వారం రోజులుగా ఈక్విటీ మార్కెట్ నష్టాల్లోనే నడిచింది. స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు జవాబు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ కాస్త ఉధృతమయ్యిందని, అందువల్లనే స్టాక్ మార్కెట్ కుదుపులకు గురవుతుందని ఇది కొంత వరకు నిజమే. కాని ఇదే ప్రధానమైన కారణం కాదు. అమెరికా చైనాల వాణిజ్య యుద్ధం నుంచి ప్రపంచంలో చాలా మార్కెట్లు తేరుకుని మళ్లీ వేగం పుంజుకున్నాయి. కాని భారతదేశంలో మాత్రం ఇంకా మాంద్యం కొనసాగుతోంది. […] The post మార్కెట్‌కు సంకీర్ణ భయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరుసగా వారం రోజులుగా ఈక్విటీ మార్కెట్ నష్టాల్లోనే నడిచింది. స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు జవాబు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ కాస్త ఉధృతమయ్యిందని, అందువల్లనే స్టాక్ మార్కెట్ కుదుపులకు గురవుతుందని ఇది కొంత వరకు నిజమే. కాని ఇదే ప్రధానమైన కారణం కాదు. అమెరికా చైనాల వాణిజ్య యుద్ధం నుంచి ప్రపంచంలో చాలా మార్కెట్లు తేరుకుని మళ్లీ వేగం పుంజుకున్నాయి. కాని భారతదేశంలో మాత్రం ఇంకా మాంద్యం కొనసాగుతోంది.

ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో మాంద్యం మరింత పెరిగింది. రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా 3 నుంచి 5 పాయింట్లు కోల్పోయాయి. ఇప్పుడు మార్కెట్ నిపుణులు భారత ఎన్నికల్లో మోడీకి మెజారిటీ వస్తుందని భావించడం లేదు. స్టాక్ మార్కెట్ రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. బిజెపి మునుపటి మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ, కనీసం సింపుల్ మెజారిటీ సాధిస్తుందని మొన్నటి వరకు భావించారు. కాని ఇప్పుడు ఆ అభిప్రాయాలు కూడా పాతబడ్డాయి. ఐదో విడత పోలింగ్ తర్వాత రాజకీయ వ్యాఖ్యాతలు, విశ్లేషకులు, మార్కెట్ నిపుణులు, బ్రోకర్లు తమ అభిప్రాయాలు మార్చుకున్నారు. బిజెపికి మెజారిటీ లభించే అవకాశం లేదన్నది అందరి అభిప్రాయం. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లకు స్థిరమైన ప్రభుత్వాలంటేనే ఇష్టం. మొరటు మెజారిటీతో నిరంకుశంగా వ్యవహరించే బలమున్న స్థిరమైన ప్రభుత్వం ఉంటే స్టాక్ మార్కెట్ మరింత సంతోషిస్తుంది.

సంకీర్ణ ప్రభుత్వాలు వస్తే అస్థిరత్వం పెరుగుతుందని భయపడతాయి. అందువల్ల 2019 ఎన్నికల్లో కూడా మోడీ భారీ మెజారిటీతో గెలవాలని స్టాక్ మార్కెట్ సహజంగానే కోరుకుంటుంది. సంకీర్ణ ప్రభుత్వం వల్ల ఏర్పడే అస్తిరత్వం రాకూడదని స్టాక్ మార్కెట్ భావించింది. కాని అలా జరగడం లేదన్న అంచనాకు స్టాక్ నిపుణులు వచ్చేశారు. అందువల్ల మే 23న ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చే వరకు ఆచితూచి వ్యవహరించడమే మంచిదని భావిస్తున్నారు.

మరోవైపు కార్పొరేట్ రంగంలో కార్యకలాపాలు కూడా మందగించాయి. ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగాలతో పాటు నిత్యావసర వస్తు సేవల్లోను బిజినెస్ మందగించింది. మ్యుచువల్ ఫండ్స్, నాన్ బ్యాంకింగ్ ఆర్ధిక కంపెనీల్లో సంక్షోభాల వల్ల మార్కెట్‌లో నగదు కొరత కూడా ఏర్పడింది. ఇప్పుడు ఎటిఎంలలో నగదు లేదన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. కాని రాజకీయ పరిణామాలపై ఆధారపడి స్టాక్ వ్యాపారులు నిర్ణయాలు తీసుకోవడం తగిన పని కాదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపెనీల ఆదాయం, లిక్విడిటీ, కంపెనీ సేవలు, ఉత్పత్తుల డిమాండ్ వగైరా దృష్టిలో ఉంచుకుని సాంకేతికాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నరు.

ఆర్ధిక విధానాలకు సంబంధించినంతవరకు సంకీర్ణ ప్రభుత్వం మెరుగైనదా? భారీ మెజారిటీతో బలంగా ఉండే ప్రభుత్వం మంచిదా అనే చర్చ కాస్త లోతయిన చర్చ. సంకీర్ణ ప్రభుత్వం వల్ల అస్తిరత్వం పెరుగుతుందని, ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదని చాలా మంది వాదిస్తుంటారు. కాని సంకీర్ణ ప్రభుత్వంలో చెక్ అండ్ బ్యాలెన్స్ అనేది గట్టిగా పని చేస్తుంది. ప్రభుత్వం ఏ పని చేసినా జవాబు చెప్పుకోవలసి వస్తుంది. అందువల్ల నోట్ల రద్దు వంటి సాహసోపేతమైన మహా తప్పులు జరగవు. భారీ మెజారిటీతో ఏం చెసినా చెల్లుతుందని వ్యవహరించే బలమైన ప్రభుత్వాలే ఇలాంటి దారుణమైన తప్పులు చేసి ప్రజలను కష్టాల ఊబిలోకి నెడతాయి. సంకీర్ణ ప్రభుత్వాల్లో ఇలాంటి ప్రమాదం ఉండదు. అలాగే ఆర్ధిక సంస్కరణలకు అవసరమైన చర్యలు తీసుకునేలా సంకీర్ణ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి పని సాధించవచ్చు. కాని బలమైన ప్రభుత్వంపై ఒత్తిడి పనిచేయదు.

కాని మార్కెట్ మాత్రం బలమైన ప్రభుత్వాన్నే కోరుతుంటుంది. దానికి ముఖ్యమైన కారణం బలమైన ప్రభుత్వం ఉండడం వల్ల విధానాలు స్థిరంగా ఉంటాయి. నిర్ణయాలు వెంటనే తీసుకోవచ్చు. అలాగే ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడం కూడా కార్పొరేట్ దిగ్గజాలకు తేలికవుతుంది. ఎందుకంటే, బలమైన ప్రభుత్వం ప్రతిపక్షాలను లెక్కపెట్టదు కాబట్టి కార్పొరేట్ డిమాండ్లకు అనుగుణంగా పనిచేసి పెట్టడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాని సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పక్షాలకు జవాబు చెప్పుకోవాలి. ప్రతిపక్షాలకు జవాబు చెప్పుకోవాలి. జవాబుదారీతనం ఎక్కువ కాబట్టి కార్పొరేట్ దిగ్గజాల డిమాండ్లకు అనుకూలంగా వ్యవహరించడం అంత సులభం కాదు. ఈ కారణాలన్నిటీనీ దృష్టిలో ఉంచుకుంటే ప్రజల ప్రయోజనాల రీత్యా సంకీర్ణ ప్రభుత్వమే మెరుగైనది. కార్పొరేట్ దిగ్గజాలకు భారీ మెజారిటీతో ఏర్పడే బలమైన ప్రభుత్వమే కావాలి. అందువల్లనే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్న అనుమానాలు కాస్త మొదలవ్వగానే మార్కెట్ కూలబడడం ప్రారంభమైంది.

భారతదేశంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మార్కెట్ కుదుపులకు గురవ్వడం మామూలే. 2009 ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. కాని యుపిఎ రెండవసారి అధికారంలోకి వస్తుందని తెలియగానే మార్కెట్ ఒక్కసారి 28 శాతం పైకెగిసింది. కాని 2004లో ఎన్‌డిఎ ప్రభుత్వం ఓడిపోయినప్పుడు, అంటే యుపిఎ మొదటిసారి ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడు మాత్రం 16 శాతం మార్కెట్ పడిపోయింది. 2014లో యుపిఎ ఓడిపోయి నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలియగానే మార్కెట్ 8 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు విడతల పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. బిజెపి సింపుల్ మెజారిటీ కూడా సాధించలేకపోవచ్చన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం తప్పదనే మాట బలంగా వినబడుతోంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ మందగించడం సహజమే. వేచి చూద్దామని చాలా మంది భావిస్తుంటారు. రిస్కు తీసుకోవడాన్ని చాలా మంది ఇష్టపడరు.

2004లోను ఇదే పరిస్థితి మనకు కనబడింది. కాని కొద్ది కాలం గడిచిన వెంటనే మళ్లీ మార్కెట్ సర్దుకుని పరుగెత్తడమే కాదు, 2009లో యుపిఎ రెండోసారి గెలిచిన వెంటనే ఒక్కసారి పైకెగిసింది. ఇప్పుడు ఈ మాంద్యం కూడా కొంతకాలం ఉండవచ్చు. కొత్త ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మళ్లీ మార్కెట్ పుంజుకుంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారు, ఇలాంటి సందర్బాల్లో చాలా జాగ్రత్తగా కాస్త రిస్కును భరించడానికి సిద్ధపడి వ్యవహరించడం, సెంటిమెంటును పక్కనపెట్టి సాంకేతికాంశాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా అనుకోని విజయాలు సాధించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు సంకీర్ణ భయం కనిపిస్తోంది.

                                                                                                  – సంజయ్ పుగాలియా ( ది క్వింట్ )
Equity market is Running losses for weekdays

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మార్కెట్‌కు సంకీర్ణ భయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: