తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

  హైదరాబాద్‌: తెలంగాణలో సెట్ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల అయ్యాయి. శనివారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. కరోనా కారణం దేశంలో లాక్ డౌన్ విధించడంతో  రాషట్రంలో అన్నీ పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. వాయిదా పడ్డ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర విద్యామండలి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సెట్ పరీక్షల తేదీలపై శనివారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఇతర అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి […] The post తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: తెలంగాణలో సెట్ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల అయ్యాయి. శనివారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. కరోనా కారణం దేశంలో లాక్ డౌన్ విధించడంతో  రాషట్రంలో అన్నీ పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. వాయిదా పడ్డ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర విద్యామండలి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సెట్ పరీక్షల తేదీలపై శనివారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఇతర అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం అనంతరం విద్యామండలి కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూలై 1న పాలిసెట్, జూలై 1నుంచి 3 వరకు పిజిఈసెట్, జూలై 6వ తేదీ నుంచి 9 వరకు ఎంసెట్‌, జూలై 4న ఈ సెట్, జూలై 10న లా సెట్, జూలై 13న ఐ సెట్, 15న ఎడ్ సెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే న్విహించనున్న తెలిపింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Entrance Exams 2020 Schedule Released in Telangana

The post తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: