క్రికెట్ సందడి షురూ..

England vs West Indies test series will be held

 

మన తెలంగాణ/ క్రీడా విభాగం: కరోనా వల్ల చాలా కాలంగా ఎక్కడి కక్కడే నిలిచి పోయిన క్రికెట్ పోటీలు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో మళ్లీ క్రికెట్ సందడి ప్రారంభమవుతోంది. ముఖ్యంగా క్రికెట్‌కు పుట్టినిల్లుగా పేరున్న ఇంగ్లండ్‌లోనే మళ్లీ క్రికెట్ పురుడు పోసుకుంటోంది. గత మార్చి నుంచి అర్ధాంతరంగా నిలిచి పోయిన క్రికెట్ సిరీస్ లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఇంగ్లండే దీనికి శ్రీకారం చుడుతోంది. వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ద్వారా ఇంగ్లండ్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు తెరలేపుతోంది. బుధవారం నుంచి ఇరు దేశాల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది.

కరోనా వల్ల పూర్తిగా చతికిల పడిపోయిన క్రికెట్‌కు ఈ సిరీస్ కొత్త దిశ చూపుతుందనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఎంత వరకు పోటీ ఇస్తుందనే విషయాన్ని పక్కన బెడితే క్రికెట్ అభిమానులకు మాత్రం ఇరు దేశాల పోరు కొత్త జోష్ ఇస్తుందనే చెప్పాలి. విండీస్ కూడా మళ్లీ పూర్వ వైభవం సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. గతంతో పోల్చితే విండీస్ ప్రస్తుతం బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. దీంతో ఇంగ్లండ్‌విండీస్‌ల సిరీస్ అభిమానులను అలరిస్తుందనే చెప్పాలి.

అక్కడ కూడా
మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రి కా తదితర దేశాల్లో కూడా క్రికెట్ సందడి మొదలైంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకున్నా దేశవాళి క్రికెట్‌కు త్వరలోనే తెరలేవనుంది. మరోవైపు దక్షిణాఫ్రికా వేదికగా ఈ నెల 18 నుంచి 3టి పేరిట కొత్త ఫార్మాట్‌లో క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నా రు. ఈ క్రికెట్‌పై కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సరి కొత్త విధానంలో జరుగుతున్న ఈ టోర్నీపై అందరి దృష్టి నెలకొంది. ఇదిలావుండగా శ్రీలంకలో కూడా దేశవాళి ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇక్కడ కరోనా ప్రభావం లేక పోవడంతో ఐపిఎల్, ఆసియాకప్ వంటి టోర్నమెంట్‌లను కూడా నిర్వహించే అవకాశాలున్నాయి.

ఇక, క్రికెట్ శ్రీలంక కూడా ఇప్పటికే క్రికెట్ పునరుద్ధరణకు పలు చర్యలు తీసుకోంటోంది. కాగా, బంగ్లాదేశ్‌లో క్రికెట్ సందడి ప్రారంభమైందనే చెప్పాలి. ఇప్పటికే క్రికెటర్లకు శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. త్వరలోనే దేశవాళి క్రికెట్‌కు తెరలేవనుంది. అఫ్గానిస్థాన్ క్రికెటర్లు కూడా ఇప్పటికే సాధన ప్రారంభించారు. రానున్న ప్రపంచకప్ కోసం అఫ్గాన్ ఆటగాళ్లు ముమ్మర సాధనలో నిమగ్నమయ్యా రు. ఆస్ట్రేలియాలో కూడా ఇప్పటికే క్రికెట్‌కు శ్రీకారం చుట్టారు. చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆటగాళ్లు మళ్లీ మైదానాల్లోకి దిగారు.

ముమ్మర సాధనతో మళ్లీ గాడిలో పడేందుకు శ్రమిస్తున్నారు. ఇలా ప్రతి దేశంలోనూ ఎక్కడ చూసి న క్రికెట్ సందడి కనిపిస్తోంది. అయితే భారత్‌లో మాత్రం ఇప్పటి వరకు క్రికెట్‌కు సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో భారత క్రికెట్ బోర్డు కూడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించేందుకు ముందుకు రావడం లేదు. ఆగస్టు వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోంది.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post క్రికెట్ సందడి షురూ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.