కివీస్‌తో తొలి టెస్టు
మౌంట్ ముంగానూయి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ కివీస్‌ను కష్టాల్లోకి నెట్టారు. ఓపెనర్లు జీత్ రావల్ (19), టామ్ లాథమ్ (6) నిరాశ పరిచారు. అయితే విలియమ్సన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న విలియమ్సన్ ఏడు ఫోర్లతో 51 పరుగులు చేశాడు.
సీనియర్ ఆటగాడు రాస్ టైలర్ 25 పరుగులు సాధించాడు. ఆట ముగిసే సమయానికి నికోల్స్ 26, వికెట్ కీపర్ వాట్లింగ్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక, ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే న్యూజిలాండ్ మరో 209 పరుగులు చేయాలి. అంతకుముందు 241/4 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే ఆలౌటైంది. బెన్ స్టోక్స్ 91పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కివీస్ బౌలర్లలో సౌథి నాలుగు, వాగ్నర్ మూడు, గ్రాండోమ్ రెండు వికెట్లు పడగొట్టారు.
England gain upper hand in first Test
Related Images:
[See image gallery at www.manatelangana.news]The post ఇంగ్లండ్ పైచేయి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.