ఇంగ్లండ్ జయభేరీ

రాయ్ మెరుపు సెంచరీ, సాకిబ్ శతకం వృథా, బంగ్లా ఓటమి కార్డిఫ్: ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ రెండో విజయం నమోదు చేసింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ (153) విధ్వంసక శతకంతో ఇంగ్లండ్‌కు భారీ స్కోరును సాధించి పెట్టాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన […] The post ఇంగ్లండ్ జయభేరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాయ్ మెరుపు సెంచరీ, సాకిబ్ శతకం వృథా, బంగ్లా ఓటమి
కార్డిఫ్: ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ రెండో విజయం నమోదు చేసింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ (153) విధ్వంసక శతకంతో ఇంగ్లండ్‌కు భారీ స్కోరును సాధించి పెట్టాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 280 పరుగులకే కుప్పకూలింది. సాకిబ్ అల్ హసన్ సెంచరీ సాధించినా ఫలితం లేకుండా పోయింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సౌమ్య సర్కార్ మరోసారి నిరాశ పరిచాడు. రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టార్ ఆటగాడు సాకిబ్ అల్ హసన్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యత తనపై వేసుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 19 పరుగులు చేసి వెనుదిరిగాడు. తమీమ్ ఔటైనా సాకిబ్ పోరాటం కొనసాగించాడు. సీనియర్ ఆటగాడు ముష్ఫికుర్ రహీంతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. సాకిబ్ తన మార్క్ షాట్లతో అలరించాడు. రహీం 44 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక, కీలక ఇన్నింగ్స్ ఆడిన సాకిబ్ చిరస్మరణీయ సెంచరీని సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సాకిబ్ 119 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. మహ్మదుల్లా (28), ముసాద్దిక్ (28) తప్ప మిగతావారు విఫలం కావడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి జట్టులో ఆర్చర్, స్టోక్స్ మూడేసి వికెట్లు తీశారు.
రాయ్ విధ్వంసం


అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాసన్ రాయ్, బైర్‌స్టోలు శుభారంభం అందించారు. ఇద్దరు ధాటిగా ఆడుతూ పరుగుల వరద పారించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బైర్‌స్టో 51 పరుగులు చేశాడు. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన జాసన్ రాయ్ పరుగుల సునామీ సృష్టించాడు. అతనికి జోస్ బట్లర్ జోరు తోడు కావడంతో ఇంగ్లండ్ భారీ స్కోరును సాధించింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రాయ్ 121 బంతుల్లోనే 14 ఫోర్లు, మరో ఐదు భారీ సిక్సర్లతో 153 పరుగులు చేశాడు. బట్లర్ 44 బంతుల్లోనే 4 సిక్స్‌లు, రెండు బౌండరీలతో 64 పరుగులు చేశాడు.

ENG vs BAN World Cup: England won by 106 runs

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇంగ్లండ్ జయభేరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: