ఇంగ్లాండ్ ఊచకోత…. బంగ్లా లక్ష్యం 387 పరుగులు

  కార్డిఫ్‌: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 386 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్టుకు 387 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు జోసన్ రాయ్(157) సూపర్ సెంచరీతో మెరువగా.. బెయిర్ స్టో(51) పరుగులతో రాణించాడు. ముఖ్యంగా రాయ్ ఫోర్లు, సిక్స్ లతో […] The post ఇంగ్లాండ్ ఊచకోత…. బంగ్లా లక్ష్యం 387 పరుగులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కార్డిఫ్‌: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 386 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్టుకు 387 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు జోసన్ రాయ్(157) సూపర్ సెంచరీతో మెరువగా.. బెయిర్ స్టో(51) పరుగులతో రాణించాడు. ముఖ్యంగా రాయ్ ఫోర్లు, సిక్స్ లతో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత జోస్ బట్లర్(64), ఇయాన్ మోర్గాన్(35), జో రూట్(21)లు వేగంగా ఆడడంతో ఇంగ్లాండ్ స్కోరు జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టింది. చివర్లో ఫ్లంకెట్‌ (18), వోక్స్‌ (27) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లీష్ జట్టు ఏకంగా 386 పరుగులతో భారీ స్కోరు చేసింది.

ENG vs BAN World Cup: Bangladesh target 387 runs

The post ఇంగ్లాండ్ ఊచకోత…. బంగ్లా లక్ష్యం 387 పరుగులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.