మోర్గాన్ సిక్సర్ల ఊచకోత…ఆఫ్గాన్ లక్ష్యం 398

మాంచస్టర్: ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గన్, అఫ్గానిస్థాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. బంతి పడిందే ఆలస్యం నేరుగా స్టాండ్స్ లోకి పంపించాడు. ముఖ్యంగా ఆఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ లక్ష్యంగా చేసుకొని మోర్గాన్(148;71 బంతుల్లో 4 ఫోర్లు, 17 సిక్స్ లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
మోర్గాన్ దెబ్బకు రషీద్ 10 ఓవర్లలో ఏకంగా 110 పరుగలు సమర్పించుకున్నాడు. దీంతో ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న 16 సిక్సుల రికార్డును మోర్గాన్ 17 సిక్సులు కొట్టి వన్డే చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా నిలిచాడు. మోర్గాన్ తోపాటు బెయిర్ స్టో(90), జో రూట్‌(88), మొయిన్ అలీ(31)లు మెరపులు మెరిపించడంతో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 397 పరుగుల భారీ స్కోరు సాధించింది.కాగా, ఈ ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. అఫ్గాన్ బౌలింగ్‌లో దవ్లత్ జార్దన్, గుల్బదిన్ నైబ్ చెరో మూడు వికెట్లు తీశారు.
ENG vs AFG: AFG Target 398 runs in 50 Overs

The post మోర్గాన్ సిక్సర్ల ఊచకోత… ఆఫ్గాన్ లక్ష్యం 398 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.