కోకిల రాగం ఎక్కడా..?

  అంతరించిపోతున్న పక్షి జాతి అడ్డగోలుగా చెట్ల నరికివేత,పెరుగుతున్న రేడియేషన్ వినిపించిన కోకిల కిలకిలలు నిజామాబాద్: వసంత కాలంలో ప్రకృతిని పులకింప చేస్తూ ఎంతో కమనీయంగా ,,మరెంతో రమణీయంగా తనగాన మాధుర్యాన్ని వినిపించే కోయాలల గొంతు ఎవరికైనా వినిపించిందా? వసంత కాలం వచ్చింది. ఉగాది పండుగ వెళ్లిపోయి ంది. కానీ కోకిల కుహుకుహు రాగాలు మాత్రం ఎ క్కడా వినిపించడం లేదు.మనిషి తన మనుగడ కోసం పక్షలను జంతువుల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నా డు. స్వలాభం కోసం […] The post కోకిల రాగం ఎక్కడా..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అంతరించిపోతున్న పక్షి జాతి
అడ్డగోలుగా చెట్ల నరికివేత,పెరుగుతున్న రేడియేషన్
వినిపించిన కోకిల కిలకిలలు

నిజామాబాద్: వసంత కాలంలో ప్రకృతిని పులకింప చేస్తూ ఎంతో కమనీయంగా ,,మరెంతో రమణీయంగా తనగాన మాధుర్యాన్ని వినిపించే కోయాలల గొంతు ఎవరికైనా వినిపించిందా? వసంత కాలం వచ్చింది. ఉగాది పండుగ వెళ్లిపోయి ంది. కానీ కోకిల కుహుకుహు రాగాలు మాత్రం ఎ క్కడా వినిపించడం లేదు.మనిషి తన మనుగడ కోసం పక్షలను జంతువుల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నా డు. స్వలాభం కోసం మిగతా పరిసరాలను ,జీవ జాలన్ని విస్మరిస్తున్నాడు. ఈ కోవలో కోకిల కుహుకుహులు వినరావడం లేదు. ఎక్కడో ఒకటి అర ఉన్నా అవికూడా అందరించే దశకు చేరాయి. ఈకోకిలలపై మన తెలంగాణ ప్రత్యేక కధనం.. వసంత కాలం వచ్చిదంటే చాలు కోకిల రాగాలు పొద్దుల మధురంగా మారుమోగేవి.కానీ నేడు ఆరాగం కనిపించకుండా కనుమరుగవుతోంది. వేసవిలో కోకిలు సేదతీరేందుకు చెట్లు లేకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. చె ట్లను అడ్డగోలుగా నరికివేయడంతో పక్షలు అంతరించిపోతున్నాయి. మరోక కారణంగా అధునాతన సాంకేతికత తో అధిక రేడియేషన్ పెరిగి అర్ధాంతరంగా మృత్యువా త పడుతున్నాయి.ఇలా చాలా కారణాలున్నా యి. దీం తో పల్లెల్లో ఆకూత కనబటం లేదు.మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించుగా 10వేల జాతుల పక్షలున్నాయి. ఇవి అతి చిన్న పరిమాణం నుంచి 6అడుగుల వరకూ ఉన్నాయి. పక్షులుకు సంబంధించిన విజ్ఞానశాస్త్రాన్ని ‘ఆర్నిధాలజీ’ అంటు పిలుస్తున్నాం.
*పట్టణాలల్లో ఇదే పరిస్ధితిః పట్టణాలల్లో ఏర్పాటవుతున్న భారీ పరిశ్రమల కారణంగా వాటి నుంచి పొ గతో వాటి జీవనం ప్రశ్నార్ధంగా మారింది. వాతావరణ మార్పులతో పక్షి జాతికి తీవ్ర ముపు్పు ఏర్పడుతో ంది. ఒకప్పుడోఏపుగా పెరిగిన చెట్టతో దొరికింది తి ంటూ తన రాగాన్ని ఆలపిస్తూ ..హయిగా జీవనం సా గించేవి.కానీ..నేడు పరిస్ధితులు భిన్నంగా మారాయి.ఇలా పలు కారణాలతో తిండి లేక పట్టణాలు ,నగరాలను వదిలి పల్లెల వైపు పరుగులు తీశాయి. కానీ పల్లెలోనూ ఇదే పరిస్ధితులతో కనరావ డం లేదు.
*పొంచున్న ప్రమాదాలుః ప్రగతి బాట పడుతున్న ప్ర తి చోట సెల్‌ఫోన్ లేనివారు లేరంటే అతిశయోక్తి కా దు. కోట్లకొద్ది సెల్‌ఫోన్లు ,వేలాది సెల్‌టవర్లుతో విడుదలయ్యే రేడియేషన్ కారణంగా పక్షులు చనిపోతున్నా యి. సెల్‌టవర్ల నుంచి వెలవడే రేడియేషన్ పక్షుల మ నుగడకు ముపు్పులా పరిణిమిస్తోంది.ఎక్కువగా బలవతున్నవి కాకుల,గబ్బీలాలు , పిచ్చుకలే కాకుండా కోకిలలూ అంతరించిపోతున్నాయి.ఇదే రేడియేషన్ భవిష్యత్తులో మనిషికి ప్రమాదకరంగా మారనుంది.ఇక పర్వారణ కాలుష్యం వల్ల కూడా కొన్ని పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. పరిశ్రమలు,వాహనాలు ,పె రిగాయి.నీరు,గాలిలో కలుషితమైన వాయువులు కలిసి మనుగడను హరించివేస్తున్నాయి.విషం చిమ్ముతున్న వాహన కాలుష్యం ,దుమ్మూధూళితో జీవజాలమంతా అంతరించిపోయే ప్రమాదంలో పడింది. ఒకనాడు గుడిసెలు ,పెంపటిళ్లే వీటికి ఆవాసాలు . ఇప్పుడు ప్రతి గ్రామాల్లోనూ కాంక్రీట్ దాబాలు దర్శనమిస్తుండడంతో వీటికి గూడు కట్టుకునేందుకు జాగ కరువైంది.

 

Endangered Cuckoo

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కోకిల రాగం ఎక్కడా..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: