చట్టాలు మహిళల చుట్టాలు!

  మనదేశంలో లింగవివక్షా, గృహహింసా, భ్రూణహత్యలు.. ఇలా పలు రకాల సమస్యలు మహిళలు సాధికారత సాధించే క్రమంలో ముందర కాళ్ల బంధంగా మారుతున్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రం ఆడవారిని అందలం ఎక్కించే దిశగా కొన్ని చట్టాలను చేశాయి. ఫిన్‌ల్యాండ్: ఈ దేశంలో సమానత్వ హక్కు చట్టం ఉంటుంది. ప్రతి విషయంలోనూ పురుషులతో సమానంగా మహిళలకీ హక్కులుంటాయి. భార్యాభర్తలు ఉద్యోగులైతే.. పిల్లల సంరక్షణ కోసం మగవారికీ సెలవులు ఉంటాయి. కేవలం ఆడవారికే ఆ బాధ్యత వదిలేయకుండా వారూ […]

 

మనదేశంలో లింగవివక్షా, గృహహింసా, భ్రూణహత్యలు.. ఇలా పలు రకాల సమస్యలు మహిళలు సాధికారత సాధించే క్రమంలో ముందర కాళ్ల బంధంగా మారుతున్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రం ఆడవారిని అందలం ఎక్కించే దిశగా కొన్ని చట్టాలను చేశాయి.

ఫిన్‌ల్యాండ్: ఈ దేశంలో సమానత్వ హక్కు చట్టం ఉంటుంది. ప్రతి విషయంలోనూ పురుషులతో సమానంగా మహిళలకీ హక్కులుంటాయి. భార్యాభర్తలు ఉద్యోగులైతే.. పిల్లల సంరక్షణ కోసం మగవారికీ సెలవులు ఉంటాయి. కేవలం ఆడవారికే ఆ బాధ్యత వదిలేయకుండా వారూ చూసుకోవాల్సి ఉంటుంది. కాలేజీ, ఆఫీసూ.. ఇలా ప్రతిచోటా సమాన హక్కులు ఉంటాయి. వాటికోసం పోరాడేందుకు నిత్యం అవగాహన కూడా కల్పిస్తుంటుంది ప్రభుత్వం.

స్వీడన్: అత్యధికంగా మాతృత్వ సెలవులు ఇస్తోన్న దేశమిది. ప్రసవానంతరం 69 వారాలపాటు వేతనంతో కూడిన సెలువులు వస్తాయక్కడ. పైగా ప్రభుత్వ రంగంలో పనిచేసేవారైతే తమ భర్తకీ ఆ సెలవులు పంచొచ్చు. అందుకే అక్కడ ఉద్యోగం చేసే మహిళల సంఖ్య 77శాతంగా ఉంది.

ఐస్‌ల్యాండ్: మహిళల్ని గౌరవించడంలో మొదటిస్థానం ఐస్‌ల్యాండ్‌ది. అంతర్జాలంలో ప్రోనోగ్రఫీని పూర్తిగా నిరోధించడంలో సఫలమైంది. సినిమాల విషయంలోనూ సెన్సార్ బోర్డు పక్కాగా పనిచేస్తుంది. మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించే ఎలాంటి వీడియోకీ వెండి తెరమీద తావుండదక్కడ. అంతేకాదు పార్లమెంట్‌లోని సగం సీట్లు మహిళకే కేటాయిస్తారు.

యూకే: మహిళల్ని బాధించే సమస్యల్లో ప్రసవ మరణాలు ఒకటి. యూకేలో ఈ శాతం చాలా స్వల్పంగా ఉంటుంది. ఎందుకంటే మహిళల ఆరోగ్యంపట్ల చాలా అప్రమత్తంగా ఉండేలా ప్రభుత్వాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు.

ఆస్ట్రేలియా: రంగం ఏదైనా కావచ్చు ఈ దేశంలో అన్ని రంగాల్లోనూ మహిళలు అగ్రస్థానంలో కనిపిస్తారు. లింగవవిక్ష అనేపదానికి అక్కడ తావులేకపోవడమే కారణం.

 
Enactment Support to Women’s in World

Related Images:

[See image gallery at manatelangana.news]