యువతకు ఉపాధి అవకాశాలు : హరీశ్ రావు

Harish Raoసిద్దిపేట : రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు.  నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో బుధవారం ఆయన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు. అగ్ర వర్ణాల్లోని పేదలకు సైతం ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కటిస్తున్న ఘనత దేశంలో ఒక్క తెలంగాణకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. యువత సోషల్ మీడియాకు బానిసలు కావద్దని ఆయన సూచించారు. కష్టపడి పని చేసేవారికి రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభాదాయకం చేయడానికి తాము కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

Employment Opportunities For Youth : Harish Rao

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యువతకు ఉపాధి అవకాశాలు : హరీశ్ రావు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.